భారతదేశాన్ని పరిపాలించే సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారత దేశ ధనాన్ని కూడా బాగా దోచుకున్నారు. భారతదేశాన్ని లూటీ చేసి అత్యంత ధనవంతుడుగా మారినా ఈ ఆంగ్లేయుడు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అతని గురించి, అలానే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు గురించి చూద్దాం. 18 ఏళ్ల వయసు లో బ్రిటన్ నుండి ఇండియాకి వచ్చిన ఒక ఆంగ్లేయుడు రాబర్ట్ క్లైవ్. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈయన గుమస్తా కింద చేరారు.
ఈస్ట్ ఇండియా కంపెనీలో జాబ్ మొదలుపెట్టిన తర్వాత మొగలులతో అలానే ఇతర భారతీయ రాజులతో పోరాడి బ్రిటిష్ వాళ్ళకి ప్రయోజనంగా మారారు. అలానే భారతదేశాన్ని దోచుకోవడం మొదలుపెట్టిన బ్రిటిష్ వాళ్లల్లో ఈయన కూడా ఉండి తన ఖజానాన్ని నింపుకున్నాడు రాబర్ట్ ఇలా చేయడంతో ఆయనపై అవినీతికి కూడా నమోదు చేయడం జరిగింది. ఈయన భారతదేశం నుండి వస్తువులను దోచుకుని బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాని నింపారట.
Also read:
అయితే దీనిపై విచారించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. తొమ్మిది వందల నౌకల్లో భారత్ నుండి బంగారాన్ని వెండి తీసుకువెళ్లారట పైగా ఎన్నో ఖరీదైనవి దోచుకు వెళ్లి బ్రిటన్ కి పంపించినట్లు తెలిసింది భారతదేశంలో విభజించి పాలించు విధానాన్ని ప్రారంభించింది ఈయనేనట. ఈ ప్రక్రియని మొదలుపెట్టిన బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రయోజన పొందారు. 1767 వ సంవత్సరంలో రాబర్ట్ భారతదేశాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. నిర్దోషిగా ఈయన విడుదలైనప్పటికీ తర్వాత ఇంగ్లాండ్లో అవినీతి ఆరోపణలని ఎదుర్కొన్నారు.