Telugu News » మంత్రి రోజా కూతురు అన్షు మాలిక సినిమాల్లోకి… ఏ సినిమా అంటే..?

మంత్రి రోజా కూతురు అన్షు మాలిక సినిమాల్లోకి… ఏ సినిమా అంటే..?

by Sravya
roja-Daughter Anshu

నటి రోజా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రోజా అందరికీ సుపరిచితమే. మంచి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని రోజా బాగా పాపులర్ అయిపోయారు. అగ్ర హీరోలు అందరితో కూడా ఆమె నటించారు. ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు. సినిమాలు ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రోజా కొంత కాలానికి రాజకీయాల్లోకి కూడా వచ్చి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. రోజా మంత్రి పదవి చేపట్టక ముందు పలు షోలలో కూడా జడ్జిగా వ్యవహరించేవారు.

మంత్రి పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్ ని వదిలేసుకున్నారు రోజా. తమిళ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు అన్షు మాలిక ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది ఆమెని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఇప్పటికే డాన్స్ తో పాటుగా యాక్టింగ్ లో కూడా ట్రైనింగ్ ఇచ్చారట. అన్షు మాలిక తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు కూడా వెయిట్ చేస్తున్నారు.

Also read:

టాలీవుడ్ దర్శకులు సైతం రోజాతో పాటుగా ఆమె భర్త ని కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది మరి తమిళ సినిమాతో ఈమె రాబోతోందా..? తెలుగు సినిమాతో వస్తోందా అనేది ఇప్పటికి ప్రశ్నార్థకమే. మరి రోజా లానే తన కూతురు అన్షు కూడా అంత మంచి నటి అవుతుందో లేదో చూద్దాం.

You may also like

Leave a Comment