Telugu News » Sabarimala: శబరిమలలో ‘అరవణ’ ప్రసాదం కొరత.. దేవస్థానం కీలక నిర్ణయం..!

Sabarimala: శబరిమలలో ‘అరవణ’ ప్రసాదం కొరత.. దేవస్థానం కీలక నిర్ణయం..!

శబరిమల(Sabarimala) భక్తులకు అందించే ‘అరవణ’ ప్రసాదానికి(Ayyappa Prasadam) కొరత ఏర్పడింది. ఒక్కో భక్తుడికి కేవలం రెండు డబ్బాలు మాత్రమే ఇవ్వాలని ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు నిర్ణయించింది.

by Mano
Sabarimala: Shortage of 'Aravana' prasad in Sabarimala..Devasthanam's key decision..!

శబరిమల(Sabarimala) భక్తులకు అందించే ‘అరవణ’ ప్రసాదానికి(Ayyappa Prasadam) కొరత ఏర్పడింది. ఈ ప్రసాదాన్ని ప్రత్యేక డబ్బాల్లో ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే, ఆ డబ్బాల కొరత కారణంగా ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు(Travancore Devaswom Board) ప్రసాదంపై ఆంక్షలు విధించింది.

Sabarimala: Shortage of 'Aravana' prasad in Sabarimala..Devasthanam's key decision..!

ఒక్కో భక్తుడికి కేవలం రెండు డబ్బాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో, అయ్యప్ప భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. ఆలయం దగ్గర విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. కిలోమీటర్ల మేరా క్యూ లైన్ ఉంటోంది.

ఇక, సంక్రాంతి సమయంలో మకర జ్యోతిని చూసేందుకు స్వాములు పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉంది. ఇలా వెళ్లిన భక్తులు భారీ సంఖ్యలో ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం డబ్బాల వాడకం బాగా పెరిగిపోయింది. కానీ కొత్త డబ్బాల తయారీ మాత్రం ఆలస్యమవుతోంది.

దీంతో అందుబాటులో ఉన్న డబ్బాలను జాగ్రత్తగా అందరికీ వచ్చేలా చేయాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతీ భక్తుడు కనీసం 10 డబ్బాలైనా కొనుగోలు చేస్తారు. దేవస్థానం బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకొని ఎక్కువ డబ్బాలు ఇవ్వాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వాములు కోరుతున్నారు.

You may also like

Leave a Comment