Telugu News » Sachin Tendulkar Deepfake: సచిన్‌ టెండూల్కర్‌కూ తప్పని ‘డీప్‌ ఫేక్‌’ కష్టాలు..!

Sachin Tendulkar Deepfake: సచిన్‌ టెండూల్కర్‌కూ తప్పని ‘డీప్‌ ఫేక్‌’ కష్టాలు..!

మాస్టర్ బ్లస్టర్ సచిన్‌కూ ‘డీప్‌ఫేక్’ వీడియో కష్టాలు తప్పలేదు. ఓ గేమింగ్‌ యాప్‌ను సచిన్‌ ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఆ వీడియోను సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌(AI) సాయంతో ఇలాంటి ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు.

by Mano

ఇటీవల కాలంలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు సృతిమించుతున్నాయి. ప్రముఖ నటీమణులు రష్మిక మందన్నా, కత్రినా కైఫ్‌తో పాటు మరికొందరు ఈ డీప్‌ఫేక్ వీడియోలతో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Sachin Tendulkar Deepfake: Sachin Tendulkar's 'Deep Fake' Difficulties..!

అయితే, తాజాగా మాస్టర్ బ్లస్టర్ సచిన్‌కూ ‘డీప్‌ఫేక్’ వీడియో కష్టాలు తప్పలేదు. ఓ గేమింగ్‌ యాప్‌ను సచిన్‌ ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఆ వీడియోను సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌(AI) సాయంతో ఇలాంటి ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు.

ఆ డీప్‌ ఫేక్‌ వీడియోలో.. ‘‘Skyward Aviator Request’’ అనే గేమింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేసినట్లుగా ఉంది. తన కూతురు సారా టెండూల్కర్‌ కూడా ఈ యాప్‌ వాడుతుందని, దీని ద్వారా వినియోగదారులు వేగంగా డబ్బులు సంపాదించవచ్చని సచిన్‌ చెప్పినట్లుగా సైబర్ నేరగాళ్లు ఆ ఫేక్ వీడియోను సృష్టించారు.

విషయం తెలుసుకున్న సచిన్ వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ’ఈ వీడియో నకిలీది. ఇలాంటివి మీ దృష్టికి వస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి’ అంటూ సచిన్ సూచించారు.

You may also like

Leave a Comment