సప్త సాగరాలు ధాటి సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్ పాండే తదితరులు నటించారు. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి నిర్మించారు. చరణ్ రాజ్ సంగీతాన్ని అందించారు.
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్ పాండే తదితరులు.
దర్శకుడు: హేమంత్ ఎం రావు
నిర్మాత: రక్షిత్ శెట్టి
సంగీత దర్శకుడు: చరణ్ రాజ్
సినిమాటోగ్రాఫర్: అద్వైత గురుమూర్తి
సంపాదకులు: సునీల్ భరద్వాజ్ మరియు హేమంత్ ఎం రావు
Also read:
కథ మరియు వివరణ:
ఇక సినిమా కథ విషయానికి వస్తే… మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ప్రియ (రుక్మిణి వసంత్) గాయని కావాలని అనుకుంటుంది. ఈమె కాలేజీ విద్యార్థిని. వీళ్ళు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ప్రియా సొంత ఊళ్ళో సముద్రం ఒడ్డున ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది. మను వాళ్ళ భవిష్యత్తు కోసం జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకుంటాడు. ఈ నిర్ణయం ఏమిటి…? ప్రియాకి అది తెలుసా…? అది బాగా వచ్చిందా లేదా…? ఇవి తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. నటీనటులు అందరు కూడా వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. క్లైమాక్స్ కూడా బాగుంది. ఈ సినిమాలో కెమిస్ట్రీ కూడా చూడడానికి ముచ్చటగా ఉంటుంది. దర్శకుడు హేమంత్ ఎం రావు బాగా తీసారు.
ప్లస్ పాయింట్లు:
కథ
సంగీతం
ఛాయాగ్రహణం
నటీ నటులు
మైనస్ పాయింట్లు:
స్లో గా సాగే సీన్స్
రేటింగ్: 2.75/5