Telugu News » Scam: సైబర్ నేరగాళ్ల నయా మోసం.. ధోనీ పేరును వాడుకుంటున్న కేటుగాళ్లు..!

Scam: సైబర్ నేరగాళ్ల నయా మోసం.. ధోనీ పేరును వాడుకుంటున్న కేటుగాళ్లు..!

మారుతోన్న కాలంతో పాటు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త దారులను ఎంచుకుంటున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఫిషింగ్ మెసేజ్‌లు, స్పామ్‌ మెసేజ్‌లతో బురిడి కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.

by Mano
Scam: New fraud of cyber criminals.. Scammers using Dhoni's name..!

మారుతోన్న కాలంతో పాటు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త దారులను ఎంచుకుంటున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఫిషింగ్ మెసేజ్‌లు, స్పామ్‌ మెసేజ్‌లతో బురిడి కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రికెటర్ ధోనీ(MS Dhoni) పేరుతో ఇప్పుడు కొత్త స్కామ్‌కు తెరలేపారు.

Scam: New fraud of cyber criminals.. Scammers using Dhoni's name..!

ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలిగ్రామ్‌(DOT) ఇండియా ప్రకటించింది. ఎక్స్(X) వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు మహేంద్ర సింగ్ ఫొటోతో కూడిన ఓ మెసెజ్‌ను పంపిస్తున్నారు. ఇందులో భాగంగా ‘నేను ధోనీ. నేను రాంచి శివారులో ఉన్నాను. అనుకోని పరిస్థితుల్లో నా వాలెట్‌లో డబ్బులు లేవు. నేను తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా డబ్బులు నాకు కొంత డబ్బులు పంపిస్తే ఇంటికి వెళ్లగానే తిరిగి చెల్లిస్తాను’ అంటూ ఓ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తున్నారు.

ఆ స్కామర్ “mahi77i2” అనే హ్యాండిల్‌తో సందేశాన్ని పంపారు. అయితే ధోని అధికారిక హ్యాండిల్ “mahi7781” అని ఉంటుంది. అయితే వెనకా ముందు ఆలోచించని కొందరు నిజమేమో అనుకొని డబ్బులు పంపిస్తున్నారు. ఇదే విషయమై డాట్‌ క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా ధోనీ పేరుతో ఇలా బస్సు టికెట్ల కోసం అడుగుతూ మెసేజ్‌ చేస్తే అది కచ్చితంగా గూగ్లీ బాల్‌ అవుతుంది. మీరు కనుక షాట్‌ ఆడడానికి ట్రై చేస్తే కచ్చితంగా క్యాచ్‌ అవుట్ అవుతారు.

మీకు ఇలాంటి మెసేజ్‌ వస్తే ధోనీ ఎలా అయితే క్షణాల్లో స్టంప్‌ అవుట్‌ చేస్తారో అలాగే ఫిర్యాదు చేయండని ఓ లింక్‌ను అందించారు. ఈ స్కాం నేపథ్యంలో ప్రజలతోపాటు క్రీడాభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ టిక్కెట్ల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు ఇటివల పలు చోట్ల వెలుగులోకి వచ్చాయి. స్కామర్‌లు అసలైన టిక్కెట్ పోర్టల్, బుక్ మై షో లాగా కనిపించే వెబ్‌సైట్‌లను సృష్టించి స్కామ్ చేస్తున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment