Telugu News » V Hanumantharao: నా అనుకున్నవాళ్లే వెన్నుపోటు పొడిచారు: వీహెచ్

V Hanumantharao: నా అనుకున్నవాళ్లే వెన్నుపోటు పొడిచారు: వీహెచ్

కాంగ్రెస్ పార్టీలో పెద్దదిక్కుగా ఉన్న తెలంగాణ(Telangana) కాంగ్రెస్ సీనియర్ నేత(Congress Senior Leader), మాజీ ఎంపీ(Ex MP) వీ.హనుమంత రావు(V. Hanumantharao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

by Mano
V Hanumantharao: The people I thought backstabbed: VH

కాంగ్రెస్ పార్టీలో పెద్దదిక్కుగా ఉన్న తెలంగాణ(Telangana) కాంగ్రెస్ సీనియర్ నేత(Congress Senior Leader), మాజీ ఎంపీ(Ex MP) వీ.హనుమంత రావు(V. Hanumantharao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

V Hanumantharao: The people I thought backstabbed: VH

 

 

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. చచ్చేవరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్నాళ్లు నన్ను మోసం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో తనకు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా తీసుకోలేదని గుర్తుచేశారు. అయినా తనకు పదవులు లెక్క కాదన్నారు.

కాగా, వీహెచ్ ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించారు. ఇందుకోసం ఇప్పటికే అధిష్టానం వద్ద అనేకసార్లు మొరపెట్టుకున్నారు. అయితే అధిష్ఠానం ఆయనను కాదని రామసహాయం రఘురాం రెడ్డికి టికెట్ ఖరారు చేసింది. దీంతో వీహెచ్ అసంతృప్తిని వెల్లగక్కారు. చివరికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందంటూ వీహెచ్ అసంతృప్తిని వెల్లగక్కారు.

రామసహాయం రఘురాం రెడ్డి రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇందిరా గాంధీ, పీవీ కుటుంబాలతో సన్నిహితంగా మెలిగారు. 1985 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ఆయనకు అధిష్టానం టికెట్ కట్టబెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వీహెచ్ వ్యాఖ్యలపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

You may also like

Leave a Comment