కాంగ్రెస్ (Congress) అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగుతోన్న ఈ యాత్ర మొదటి రోజు సక్సెస్ గా సాగినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు రెండో రోజు కూడా రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి యాత్ర కొనసాగిస్తున్నట్టు తెలిపారు..
ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో ముగించనున్నట్లు సమాచారం.. మరోవైపు రాహుల్ గాంధీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కుల ఘర్షణలపై బీజేపీ టార్గెట్ గా విరుచుకుపడుతోన్నారు..
అదీగాక పార్లమెంట్ ఎన్నికల్లో విక్టరీ సాధించాలనే తపనతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజల్లో ఒకరిగా ఉంటూనే.. ప్రచారం నిర్వహించుకొనేలా వ్యూహం రచించినట్టు సమాచారం.. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో హస్తం నేతలు ముదుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి మొదలుపెట్టినట్టు అనుకొంటున్నారు..
ఈ నేపథ్యంలో రాహుల్ బీజేపీ (BJP) తీరుపై మండిపడ్డారు.. మణిపూర్ (Manipur)లో ఇంత హింస జరుగుతోన్న.. ఇప్పటివరకు భారత ప్రధాని ఇక్కడకు రాక పోవడం సిగ్గుచేటని విమర్శించారు.. ఇక్కడ ఎన్నో కుటుంబాలు అన్యాయం అయినట్టు పేర్కొన్నారు.. మరోవైపు ఆదివారం రాత్రి మణిపూర్, ఇంఫాల్‌లోని కౌజెంగ్లిమా స్పోర్ట్స్ అసోసియేషన్, ఫుట్‌బాల్ గ్రౌండ్లో విశ్రాంతి తీసుకొన్న రాహుల్.. నేటి ఉదయం 8 గంటల నుంచి యాత్రను ప్రారంభించారు..