ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తీసుకొంటున్నాయి.. త్వరలో జరగబోయే ఎన్నికలలో భాగంగా.. ప్రధాన పార్టీలు వారి వారి వ్యూహాలకు పదునుపెట్టే పనిలో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు టార్గెట్గా సభలు, సమావేశాలు, రహస్య భేటీలు నిర్వహించుకొంటూ ముందుకు సాగుతోన్నారు. ఇప్పటికే టీడీపీ (TDP).. జనసేన.. వైసీపీ (YCP) ఓటమి లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసుకొంటుండగా.. కాంగ్రెస్ (Congress) సైతం గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దం అవుతోన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్, జనసేన (Janasena) నేత నాగబాబు (Naga Babu).. కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం అయ్యారనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోన్నాయి. విశాఖలోని బీచ్ రోడ్డులోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కనీసం సెల్ ఫోన్లకు సైతం అనుమతి ఇవ్వకుండా అత్యంత రహస్యంగా ఈ సమావేశం నిర్వహించినట్టు సమాచారం..
మరోవైపు ఈ సమావేశంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.. పదవులపై పవన్ కల్యాణ్, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్.. తప్ప మిగిలిన నాయకులను పరిగణలోకి తీసుకోవద్దని నాగబాబు స్పష్టం చేసినట్టు అనుకొంటున్నారు. ఇంత కాలం రెండు సామాజిక వర్గాలకే ప్రధానంగా ఉన్నాయని.. ఇప్పుడు మార్పు రావాల్సిందేనని తీర్మానం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది..
అభ్యర్థి ఎవరనే దానిపై దృష్టి నిలపడం కంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ విజయం కోసం పని చేయాలని కాపు నేతలకు, వ్యాపారప్రముఖులను నాగబాబు కోరినట్టుగా తెలుస్తోంది. కాగా జనసేన.. టీడీపీ 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పొత్తులు పెట్టుకొని ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే.. అదీగాక వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధిస్తుందనే ధీమా.. పార్టీలో.. కార్యకర్తల్లో నెలకొంది. అయితే, బీజేపీతో పొత్తు వ్యవహారం తెలాల్సి ఉంది.