Telugu News » Red Sea: ఎర్ర సముద్రంలో అలజడి.. అమెరికా హెచ్చరికలు బేఖాతరు..!

Red Sea: ఎర్ర సముద్రంలో అలజడి.. అమెరికా హెచ్చరికలు బేఖాతరు..!

వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా హౌతీలు వినిపించుకోవడంలేదు.

by Mano
Red Sea: Turmoil in the Red Sea.. America's warnings are unheeded..!

ఎర్ర సముద్రం (Red Sea)లో అలజడి మొదలైంది. వాణిజ్య నౌకల(Merchant Ships)పై దాడులను వెంటనే ఆపాలని యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌(Hothi Rebels)ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా హౌతీలు వినిపించుకోవడంలేదు.

Red Sea: Turmoil in the Red Sea.. America's warnings are unheeded..!

ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్న నౌకలను టార్గెట్‌గా చేసుకుని హమాస్‌కు మద్దతుగానే హౌతీలు ఈ దాడులకు పాల్పడుతున్నాయి. హౌతీలకు ఇరాన్ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ బేఖాతరు చేసింది. మరోసారి వాణిజ్య షిప్స్‌పై దాడులకు దిగింది. మానవరహిత ఉపరితల డ్రోన్‌ను ప్రయోగించి ఈ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్- గాజా యుద్ధం తర్వాత హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులు చేశారు.

మరోసారి వాణిజ్య నౌకలపై దాడి చేయడంపై అమెరికా నావల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండర్ అధికారి బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ.. పేలుడుకు ముందు మానవరహిత ఉపరితల నౌక (యూఎస్‌వీ) యెమెన్ నుంచి అంతర్జాతీయ షిప్పింగ్ లైన్లలోకి వస్తుండగా దానిపై డ్రోన్లతో ఎటాక్ చేసిందని తెలిపారు. అయితే, యూఎస్‌వీ ఏ నౌకను లక్ష్యంగా చేసుకుంటుందనే దాని గురించి అతడు స్పష్టంగా చెప్పలేదు.

You may also like

Leave a Comment