Telugu News » Arvind Kejriwal ED Arrest: ‘రెండు మూడు రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్..!!’

Arvind Kejriwal ED Arrest: ‘రెండు మూడు రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్..!!’

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​( Delhi Chief Minister Arvind Kejriwal)ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్​ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌తో తాము పొత్తు పెట్టుకున్నందుకే బీజేపీ ఈ కుట్రలు చేస్తోందన్నారు.

by Mano

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​( Delhi Chief Minister Arvind Kejriwal)ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్​ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఆందోళన వ్యక్తం చేసింది. కేజ్రీవాల్​ అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ శ్రేణులు వెల్లడించారు. కాంగ్రెస్‌తో తాము పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీ భయపడుతోందన్నారు.

Arvind Kejriwal ED Arrest: Arvind Kejriwal in two to three days: Op

అందుకే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈడీతో పాటు సీబీఐ ఇందుకు సిద్ధమవుతోందని చెప్పారు. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలు కనబడుతున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ అరెస్టుకు సీఆర్​పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే నోటీసులు పంపేందుకు సిద్ధమైనట్లు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్​ తెలిపారు.

అదే జరిగితే ప్రజా సునామీ వస్తుందన్నారు. అందులో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ హెచ్చరించారు. త్వరలో ఈ ప్రకటన రానుండటంతోనే బీజేపీకి నిద్ర పట్టక కేజ్రీవాల్ అరెస్టుకు కుట్రలు చేస్తోందంటూ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. అందుకే ఈడీ, ఎక్సైజ్‌ విభాగాలతో సమన్లను పంపిందంటూ ఆయన ఆరోపించారు.

You may also like

Leave a Comment