Telugu News » AP : షాకిచ్చిన ఇంటలిజెన్స్ రిపోర్ట్.. ఏపీలో గెలిచే పార్టీ ఇదే..? స్పందించిన చంద్రబాబు..

AP : షాకిచ్చిన ఇంటలిజెన్స్ రిపోర్ట్.. ఏపీలో గెలిచే పార్టీ ఇదే..? స్పందించిన చంద్రబాబు..

ఏపీ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఆసక్తికర రిపోర్ట్ విడుదల చేయడం సంచనలంగా మారింది. మరోసారి వైసీపీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఈ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.

by Venu
TDP Vs YCP: Tension in Nandigama.. Clash between TDP and YCP workers..!

ఏపీ (AP)లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.. వైసీపీ (YCP) ఓటమి లక్ష్యంగా కూటమి వ్యూహాలు రచిస్తుండగా.. రెండోసారి కూడా అధికారం కైవసం చేసుకోవాలని జగన్ (Jagan) పావులు కదుపుతున్నారు.. అలాగే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలోపడ్డారు..

CBN: The state has been corrupted.. Chandrababu is angry with the YCP regime..!అదీగాక గెలుపు ఓటమిలపై రాష్ట్రంలో అప్పుడే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఆసక్తికర రిపోర్ట్ విడుదల చేయడం సంచనలంగా మారింది. మరోసారి వైసీపీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఈ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. వైసీపీకి 124 వస్తాయని, ఎన్డీయే కూటమిని 51 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది..

మరోవైపు ఈ రిపోర్ట్‌పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) స్పందించారు. వైసీపీ తెరపైకి ఫేక్ సంస్థను తెచ్చిందని విమర్శించారు.. జగన్ వద్దు.. ఆయన పాలన వద్దు.. అంటూ ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకోన్నట్లు ఆరోపించారు.. ఎన్నికల్లో ఒడిపోతానని భావించిన ఆయన.. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నకిలీ సంస్థను ఆశ్రయించారని విమర్శించారు.

ఇప్పుడంతా అప్డేట్ అయ్యారని.. ఇలాంటి ఫేక్ సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజల్లో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు ఎన్ని సర్వే సంస్థలు అనుకూలంగా రిపోర్ట్‌లు విడుదల చేసినా.. ఆయనపై ఉన్న వ్యతిరేకతను మార్చలేవని పేర్కొన్నారు.. అదేవిధంగా కూటమికి పట్టం కట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకొన్నట్లు తెలిపారు.. జగన్ (Jagan) పాలనలో జనం అంతా జలగల్లా పీడింపబడ్డారని ఆరోపించారు..

You may also like

Leave a Comment