Telugu News » Katchatheevu : కచ్చతీవు వివాదంపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ మంత్రి..!

Katchatheevu : కచ్చతీవు వివాదంపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ మంత్రి..!

వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ దీవుల్ని శ్రీలంకకు అప్పగించడంతో తరుచుగా తమిళనాడు మత్స్యకారులను ఆ దేశ నేవీ అరెస్ట్ చేయడంతో పాటు బోట్లను జప్తు చేయడం వారికి ఇబ్బందికరంగా మారింది.

by Venu
Govt plans 23-km sea bridge between India and Sri Lanka

ప్రస్తుతం దేశంలో కచ్చతీవు (Katchatheevu) దీవుల అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గత వారం రోజుల ముందు ప్రధాని మోడీ (Modi)తో పాటు బీజేపీ (BJP) ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.. 1970లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత్‌కి చెందిన హిందూ మహాసముద్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక (Sri Lanka)కు అప్పగించిందని ఆరోపిస్తోంది.

ఈ వ్యాఖ్యలు డీఎంకే ప్రభుత్వాన్ని ఇరుకున పడేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే నేత కరుణానిధి ఉన్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీపై పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.. ఎందుకంటే.. తాజాగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మిత్రపక్షాలుగా పోటీచేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ అంశం తెరపైకి రావడం చర్చాంశనీయంగా మారింది.

మరోవైపు వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ దీవుల్ని శ్రీలంకకు అప్పగించడంతో తరుచుగా తమిళనాడు మత్స్యకారులను ఆ దేశ నేవీ అరెస్ట్ చేయడంతో పాటు బోట్లను జప్తు చేయడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కచ్చతీవు వివాదంపై శ్రీలంక విదేశాంగ మంత్రి స్పందించారు. ఈ ద్వీపానికి సంబంధించిన సమస్య పరిష్కారమైందని, ఎలాంటి వివాదం లేదని అలీ సబ్రీ వెల్లడించారు.

ఈ సమస్య 50 ఏళ్ల క్రితమే పరిష్కారమైందని తెలిపిన ఆయన మళ్లీ ఈ అంశం తెరపైకి తీసుకురావలసిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే కచ్చతీవుపై ఇప్పటి వరకు చర్చించలేదని క్యాబినెట్ అధికార ప్రతినిధి, సమాచార మంత్రి బందుల గుణవర్ధన మీడియాకు తెలిపారు.. ఇదిలా ఉండగా ఈ వివాదంపై శ్రీలంక మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర స్పందన కనిపించినప్పటికీ, ప్రభుత్వ పరంగా పెద్దగా స్పందన లేనట్లుగా తెలుస్తోంది.

 

You may also like

Leave a Comment