సాధారణంగా కరెంట్ బిల్ (Current Bill) వెయ్యో రెండు వేలో వస్తేనే లబోదిబో మంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని ఒక షాపు యజమానికి ఏకంగా కోటిరూపాయలు కరెంట్ బిల్ రావడంతో షాప్ యజమానే కాదు విద్యుత్ (Current) అధికారులు కూడా షాక్ గురయ్యారు.
జువెలరీ షాపుకు కోటి రూపాయల కరెంట్ బిల్లు రావడంతో ఆ షాప్ యజమాని ఖంగుతిన్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కొట్టూరు టౌన్‌లోని పాలకొండ రోడ్డులో జి అశోక్ అనే వ్యక్తి దుర్గా జువెలరీ అనే షాపును నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు 1,01,56,116 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో అశోక్ ఆందోళన చెందాడు. వెంటనే సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేశారు.
బిల్లును పరిశీలించిన అధికారులు కొత్త బిల్లు ఇస్తామని హామి ఇచ్చారని అశోక్ తెలిపారు. గతంలో నెలకు ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిదివేల రూపాయల మధ్యలో కరెంట్ బిల్లు వచ్చేదని ఆయన తెలిపారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.