Telugu News » Srinivas Goud: ‘అసత్య ప్రచారాలతో అధికారం.. ఎన్నికల హామీలు ఏమయ్యాయి?’

Srinivas Goud: ‘అసత్య ప్రచారాలతో అధికారం.. ఎన్నికల హామీలు ఏమయ్యాయి?’

తెలంగాణలో కాంగ్రెస్(Congress) సర్కార్ అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్(Srinivas Goud) ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

by Mano

తెలంగాణలో కాంగ్రెస్(Congress) సర్కార్ అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్(Srinivas Goud) ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Srinivas Goud: 'Power with false campaigns...what happened to election promises?'

కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో ఎండిన పంటలకు ఎకరానికి రూ. 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ‘‘రైతు దీక్ష’’ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, రసమయి బాలకిషన్, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో కరవు వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు కరవు రాలేదన్నారు. ఎన్నికల్లో అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్‌ను గద్దె దింపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలన్నారు. చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు రైతులకు సాగునీరు అందించాలన్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తక్షణమే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమచేయాలని  కోరారు.

You may also like

Leave a Comment