Telugu News » Telangana : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ సంచలన నిర్ణయం.. కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారా..?

Telangana : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ సంచలన నిర్ణయం.. కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారా..?

అధికారం తమదేనంటూ మాట్లాడటం వెనుక ఉన్న బలం ఫోన్ ట్యాపింగ్ అని తెలుసుకోవడానికి రేవంత్ సర్కార్ కు ఎక్కువ సమయం పట్టలేదని తెలుస్తోంది.

by Venu
CM KCR Public Meeting at Nizamabad

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.. ఆదేగాక.. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే మైండ్ గేమ్ కు తెరతీశారని హస్తం నేతలు మండిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.. అయితే బీఆర్ఎస్ ఏ ధీమాతో ఈ వ్యాఖ్యలు చేస్తుందో అర్థం అవ్వక అయోమయంలో పడిపోయారు.. కాలజ్ఞానం తెలిసిన జ్ఞానిలా గులాబీ పెద్ద, చిన్న బాస్ మొదటి నుంచి ప్రత్యర్థుల జాతకాలు సైతం తెలియచేసారు.

మరోవైపు అధికారం తమదేనంటూ మాట్లాడటం వెనుక ఉన్న బలం ఫోన్ ట్యాపింగ్ అని తెలుసుకోవడానికి రేవంత్ సర్కార్ కు ఎక్కువ సమయం పట్టలేదని తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ అధికారం కోసం ఎంతలా దిగజారిందో తెలుపుతూ ఈ మధ్యకాలంలో పలు వార్తలు వచ్చాయి.. అదీగాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదుపులోకి తీసుకొన్న వారందరూ ఆయన చెబితే తాము చేశానని స్టేట్ మెంట్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది..

ఈ ఆయన ఎవరిని ఆలోచిస్తే.. అందరి చూపు గులాబీ ముఖ్య నేతలవైపు ఉందనే ప్రచారం మొదలైంది. అయితే గత రెండు నెలలుగా తెలంగాణ (Telangana) రాజకీయాలను కుదిపేస్తోన్న ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ పెదవి విప్పలేదు.. కానీ పరిస్థితి చేయి జారిపోతుందని భావించారు కావచ్చు.. అందుకే తాజాగా స్పందించారని.. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తానని తెలిపినట్లు చర్చించుకొంటున్నారు.

తదుపరి పెద్దాయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ (KCR)అన్ని విషయాలను బయటపెడతానని అనడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం కల్వకుంట్ల ఫ్యామిలీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందని అంతా భావిస్తున్న సమయంలో.. ఆయన ఏం మాట్లాడుతారనేది ఉత్కంఠంగా మారింది.

మరోవైపు ఈ అంశంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నా.. ఆయనకు వ్యతిరేకంగా నిందితుల స్టేట్ మెంట్లు బలంగా ఉన్నాయి. కాబట్టి.. ఆయన రివర్స్ ఎటాక్ చేసినా.. లేదా మరేవిధంగా ఈ వ్యవహారం దారితప్పించి తమకు ముప్పులేకుండా చేయాలని ప్రయత్నించినా అవన్నీ జరిగే పనులు కావని అంటున్నారు.. అదేవిధంగా ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ (Congress) నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే..

అధికార దుర్వినియోగానికి పాల్పడకుంటే.. బీఆర్ఎస్ కు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి.. కవిత తప్పు చేయకుంటే.. జైలుకు వెళ్ల వలసిన అవసరం ఏముందనే వాదన వినిపిస్తుంది. అలాగే కేటీఆర్ (KTR) అహంకారపురితమైన మాటలు దేనికి సంకేతం అనే అనుమానాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పెద్ద బాస్ విచారణ ఎదుర్కోక తప్పదనే టాక్ వినబడుతోంది..

You may also like

Leave a Comment