Telugu News » సలార్ సినిమాలో నటించిన శ్రీయ రెడ్డి తండ్రి క్రికెటర్ అని తెలుసా..?

సలార్ సినిమాలో నటించిన శ్రీయ రెడ్డి తండ్రి క్రికెటర్ అని తెలుసా..?

by Sravya

సలార్ సినిమా గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ కి చాలా కాలం తర్వాత మంచి హిట్ సలార్ తో వచ్చింది. సలార్ సినిమాలో రాధా రామ పాట లో నటించిన నటి శ్రియ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటన తో అందరినీ ఈమె ఆకట్టుకుంది. . మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా ఈమె సంపాదించుకుంది. ఈమె ని చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఇంకో విలన్ దొరికిందని అందరూ సంతోషపడుతున్నారు. పైగా ఈమె నటన కూడా అద్భుతంగా ఉంది. శ్రీయ రెడ్డి గురించి ప్రతి ఒక్కరు కూడా అర తీయడం మొదలుపెట్టారు.

ఇదివరకే విశాల్ హీరోగా వచ్చిన పొగరు సినిమాలో ఈమె విలన్ గా కనిపించింది విశాల్ అన్నయ్య ని ఈమె నిజ జీవితంలో పెళ్లి చేసుకుంది. విశాల్ కి వదిన అయింది. పెళ్లి తర్వాత కొంతకాలం అమెరికాలో ఉంది శ్రియ రెడ్డి. తర్వాత చెన్నై వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ నటించడం స్టార్ట్ చేసింది. ఈ మధ్య ఈమె ఒక వెబ్ సిరీస్ లో నటించారు ఇప్పుడు సలార్ సినిమాలో కనబడి అందరిని ఆకట్టుకుంటున్నారు.

Also read:

అయితే శ్రియ రెడ్డి ఒక క్రికెటర్ కూతురు అన్న విషయం చాలామందికి తెలియదు శ్రియ రెడ్డి తండ్రి భరత్ రెడ్డి చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయి లో భరత్ రెడ్డి టీమ్ ఇండియా తరపున క్రికెట్ ఆడారు. 1978 నుండి 81 వరకు మూడు ఇంటర్నేషనల్ మ్యాచ్లో వికెట్ కీపర్ గా ఉన్నారు. తర్వాత క్రికెట్ శిక్షణ శిబిరాలని కూడా మొదలుపెట్టారు. ఇలా క్రికెట్ రంగంలో ఆయనకి చాలా అనుభవం ఉంది. ఈ సినిమా తో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో కూడా ఈమెకి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం

You may also like

Leave a Comment