గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదంటున్నారు.. అయితే ఈ పోర్టల్ పై స్పష్టతనివ్వాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ధరణిని కొనసాగిస్తారా?.. లేదా?.. చెబితే.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తమ ముందున్న పిటిషన్లను పరిష్కరిస్తామని తెలిపింది.
ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలో ఉందో వివరణ ఇవ్వాలని నూతన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని హైకోర్టు (High Court) అడిగింది. అయితే ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని ఏజీ చెప్పడంతో విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ధరణి పోర్టల్ పై తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ (Congress) నేతలు పలు విమర్శలు చేశారు..
అయితే ఇప్పటికి ధరణి పోర్టల్ వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగం లేదనే వాదనలున్నాయి.. మరోవైపు ఈ పోర్టల్ వల్ల చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టిగాగులపల్లిలో వివిధ సర్వే నెంబర్లలోని 146.05 ఎకరాలకు చెందిన వివాదం రగులుకొంది.
ఈ భూమి విక్రయ దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను గండిపేట ఎమ్ఆర్ఓ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ.. హైదరాబాద్‌కు చెందిన ఎం జైహింద్ రెడ్డితో పాటు మరికొందరు ధరణిలో ఎదువుతున్న సమస్యలపై పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ గత ఏడాది ఏప్రిల్‌లో విచారణ చేపట్టడంతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ను కోర్టుకు పిలిపించి పలు సందేహాలపై వివరణ కోరారు. మరోవైపు ధరణిలో 20 వరకు ప్రధానంగా సమస్యలు ఉన్నాయని కోర్టుకు వస్తున్న పిటిషన్ల ఆధారంగా గుర్తించారు.. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి మార్గం చూపుతారా.. లేదా ధరణి క్యాన్సిల్ చేస్తారా అనేది సస్పెన్స్ లో ఉంది..