హైదరాబాద్(Hyderabad)లోని చంపాపేట్(Champapet)లో శనివారం ఉదయం జరిగిన స్వప్న(Swapna) అనే యువతి హత్య(murder) కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. స్వప్న కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మృతిచెందిన స్వప్న అనే యువతి గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా ప్రియుడు సతీష్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్ లోని స్వప్న ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో స్వప్నకు తన భర్త ప్రేమ్ మధ్యన ఇటీవల మనస్పర్ధలతో గొడవలు చోటుచేసుకున్నాయి.
కాగా శనివారం ఉదయం 11:30గంటలకు చంపాపేట్‌లోని స్వప్నఇంటికి సతీష్.. అతడి స్నేహితునితో కలిసి వచ్చాడు. అనంతరం స్వప్న గొంతు కోసి హత్య చేశారు. ప్రేమ్‌ను రెండవ అంతస్తు నుంచి కిందకు నెట్టివేశాడు. ప్రస్తుతం స్వప్న భర్త ప్రేమ్ కుమార్ ఉస్మానియా ఆసుపత్రిలోని ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమ్‌కుమార్ స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మూడు బృందాలుగా ఏర్పడి కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.