Telugu News » BJP : తగ్గేదేలే.. బీజేపీ v/s కాంగ్రెస్‌.. కొనసాగిస్తున్న డిక్లరేషన్‌ల పర్వం..!!

BJP : తగ్గేదేలే.. బీజేపీ v/s కాంగ్రెస్‌.. కొనసాగిస్తున్న డిక్లరేషన్‌ల పర్వం..!!

అధికారం ధ్యేయంగా పార్టీలు ప్రచారాలు చేసుకుంటున్నాయని, అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని ఇప్పటికే జనంలో ప్రచారం జోరందుకుంది. వీటికి తగ్గట్టుగానే ఓ వైపు బీజేపీ (BJP) బీసీ నినాదం (BC motto).. మరోవైపు మైనార్టీ డిక్లరేషన్‌ (Minority Declarations)లతో కాంగ్రెస్‌ (Congress) ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.

by Venu

కులాల వారీగా పథకాలు.. మతాల వారీగా ప్రభుత్వాలు.. వారసత్వంగా పదవులు.. వ్యాపారంగా చదువులు.. ఇంకెక్కడ మరి ప్రజాస్వామ్య సామ్యవాద.. లౌకిక, న్యాయ, సమానత్వ స్వేచ్చా రాజ్యం.. ప్రస్తుతం నేటి సమాజంలో రాజకీయాల తీరుకు అద్దం పడుతున్న ఈ అక్షరాలను వల్లే వేసుకుంటూ మేధావులు మౌనం వహిస్తున్నారని సమాజం అనుకుంటుంది.

మరోవైపు అధికారం ధ్యేయంగా పార్టీలు ప్రచారాలు చేసుకుంటున్నాయని, అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని ఇప్పటికే జనంలో ప్రచారం జోరందుకుంది. వీటికి తగ్గట్టుగానే ఓ వైపు బీజేపీ (BJP) బీసీ నినాదం (BC motto).. మరోవైపు మైనార్టీ డిక్లరేషన్‌ (Minority Declarations)లతో కాంగ్రెస్‌ (Congress) ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. తెలంగాణ (Telangana)లో బీజేపీ సకల జనులకు అండ.. ట్యాగ్ లైన్‌తో జనం గుండెల్లో స్థానం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు తగ్గట్టుగా ఈనెల 7వ తేదీ హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో.. బీసీ ఆత్మగౌరవ సభను ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) సమక్షంలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ లక్ష మందితో సభ నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అమిత్‌షా సూర్యాపేట సభలో బీసీ సీఎం నినాదాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. మెజార్టీ శాతం ఉన్న బీసీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిందని ప్రచారం జరుగుతుంది.

మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఏం తక్కువ తినలేదన్నట్టు ఇప్పటికే ఆరు హామీలతో పాటు.. డిక్లరేషన్‌లు, బస్సుయాత్రలు చేస్తుంది. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ, రైతు, మహిళ డిక్లరేషన్‌లు ప్రకటించింది. మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించబోతుంది. అయితే ఒకవేళ తెలంగాణ అధికార పగ్గాలు కారు దక్కించుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని మేధావి వర్గం వెల్లడిస్తుంది. మొత్తానికి ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందు ప్రయత్నిస్తున్న పార్టీల ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.

You may also like

Leave a Comment