మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) మళ్లీ బీజేపీ (BJP)లో చేరారు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో కండువా కప్పుకొన్నారు.. హుజూర్ నగర్లో ఉప ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ నుంచి బీఆర్ఎస్ (BRS)లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు తెలుగుదేశంలో 35 సంవత్సరాలు పనిచేసిన ఆయన.. అనంతరం పార్టీ మారారు.. బీజేపీలో మూడేళ్లు ఉన్నారు..
అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పిన కేసీఆర్ మాట కోసం బీఆర్ఎస్ లో చేరడం జరిగిందని ఒక సందర్భంలో పేర్కొన్నారు.. కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ విధానాలు, కేసీఆర్ అవలంబిస్తున్న తీరు నచ్చక మళ్ళీ నా సొంత గూడు బీజేపీలోకి వచ్చానని తెలిపారు.. మోడీ మరోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మోడీని ఓడించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన సిద్దాంతం ముఖ్యం అనుకొన్న కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్లలేదన్నారు.
పెద్దిరెడ్డి గతంలో టీడీపీ, నవ తెలంగాణ, ప్రజారాజ్యంలో పనిచేశారు. అలాగే 1999-2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని భావిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత ఆ పార్టీకి షాకిచ్చారు..
నేడు పార్టీ మారారు.. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో వెంకటేశ్ నేత కాషాయ కండువా కప్పుకొన్నారు. కాగా కాంగ్రెస్ నుంచి ఆయన పెద్దపల్లి టికెట్ ఆశించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకు అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో చిన్నబుచ్చుకొన్న ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆసమయంలో ప్రచారం జరిగింది. తాజాగా అది నిజం అయ్యింది.