Telugu News » Telangana : కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేస్తున్న బీఆర్ఎస్-బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో విక్టరీ ఖాయమా..?

Telangana : కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేస్తున్న బీఆర్ఎస్-బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో విక్టరీ ఖాయమా..?

ఇంకా లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడకముందే, పార్టీలు ఇంత దూకుడుగా ఉన్నాయి. ఎన్నికలవేడి రాజుకున్నాక, ఈ మైండ్ గేమ్ మరింత ముదురుతొందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది.

by Venu
congres

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకరకంగా ఇక్కడి రాజకీయాల్లో మైండ్ గేమ్ మొదలైనట్టు అనుమానాలు కలుగుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా.. విమర్శలతో కాంగ్రెస్ ను అయోమయంలో పడేస్తుందని అనుకొంటున్నారు..

అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కుదురుకొని.. పట్టు సాధించాలంటే కనీసం సంవత్సరం అయినా పడుతోంది. ఈ విషయాలు తెలిసినా.. పైకి మాత్రం కేటీఆర్ (KTR).. హరీష్ రావు (Harish Rao).. ప్రజల్లో కాంగ్రెస్ (Congress)ను విఫలం చేయడానికి తెగ ఆరాటపడుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ (BJP).. ఈ రెండు పార్టీల మధ్య పొరును తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో రేవంత్ (Revanth) ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ (BRS), బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటోందని అనుకొంటున్నారు. ప్రభుత్వం బలహీనంగా ఉందన్న అభిప్రాయం కలిగేలా.. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయంటున్నారు.. బీఆర్ఎస్ చేసిన అవినీతిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న హస్తం నేతలు.. వారు మాటిమాటికి విమర్శించడంతో ఇంకా పట్టుదలతో ముందుకు సాగుతోన్నట్టు తెలుస్తోంది.

అదీగాక ఏ క్షణాన్నయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ (KCR) కూలుస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాదు బీజేపీనే కూలుస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నాయనే సంకేతాలు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో క్లీన్ స్వీప్‌కు విపక్షాలు మంచి అస్త్రం ఇచ్చాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రణాళికాబద్దమైన వ్యూహ రచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది..

ఇంకా లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడకముందే, పార్టీలు ఇంత దూకుడుగా ఉన్నాయి. ఎన్నికలవేడి రాజుకున్నాక, ఈ మైండ్ గేమ్ మరింత ముదురుతొందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది. మరోవైపు రెండు పార్టీల మైండ్ గేమ్‌పై రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారు. తేడా వస్తే మాత్రం కల్ట్ చూపిస్తానని వార్నింగ్ సైతం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి..

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు న్యూస్ కోసమై ఇవి చదవండి…!

You may also like

Leave a Comment