Telugu News » Balakrishna : ఘనంగా నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ..!!

Balakrishna : ఘనంగా నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ..!!

తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని పేర్కొన్నారు. తన పాలనతో ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచారని, పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు..

by Venu

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా నేడు హైదరాబాద్‌ (Hyderabad) ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా.. ఎన్టీఆర్​ ఘాట్​ను పూలతో అలంకరించారు ఈ సందర్భంగా ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR NTR), కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు.

గురువారం వేకువజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఎన్టీఆర్​ జోహార్, ఎన్టీఆర్​ అమర్​ రహై​ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Hero Balakrishna) సైతం కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటు రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులు సుహాసిని, పలువురు పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని, నవ యువతకు మార్గదర్శనమని తెలిపారు..

తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని పేర్కొన్నారు. తన పాలనతో ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచారని, పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు.. అయితే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలిరావడంతో కొద్దిగా తోపులాట చోటుచేసుకొంది.

మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఇకపోతే Sr NTR.. రాముడు, కృష్ణుడు, ఏడుకొండల వెంకన్నా, పోతులూరి వీరబ్రహ్మన్న.. ఇలా ఏ పాత్ర చేస్తే ఆ పాత్రకు నిండుదనం ఉండేది.. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్..

You may also like

Leave a Comment