Telugu News » Telangana Budget 2024 : బడ్జెట్ లో పేదలకు ఉపయోగపడే అంశాలపై వివరణ ఇచ్చిన భట్టి..!

Telangana Budget 2024 : బడ్జెట్ లో పేదలకు ఉపయోగపడే అంశాలపై వివరణ ఇచ్చిన భట్టి..!

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని.. ప్రతి పేదవాడికి విద్యను అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్ లో రూ. 21వేల 389 కోట్లు కేటాయించామని తెలిపారు.

by Venu
funds allocated by the government to various departments in the budget

తెలంగాణ (Telangana) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాటలతో, విమర్శలతో గరం గరంగా సాగుతున్నాయి. నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క (Bhatti Vikramarka).. అనంతరం తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని.. విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

funds allocated by the government to various departments in the budget

కానీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని.. ప్రతి పేదవాడికి విద్యను అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్ లో రూ. 21వేల 389 కోట్లు కేటాయించామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను, దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తరహాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇందుకోసం బడ్జెట్ లో రూ. 500 కోట్లను కేటాయించామని తెలిపారు. ఫీజు రీఇంబర్స్ మెంట్ తోపాటు స్కాలర్ షిప్ లను సకాలంలో అందజేస్తామన్నారు. ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా.. నిరుద్యోగులకు వందశాతం ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సైతం సర్కార్ ఆలోచన చేస్తుందని తెలిపారు. దీని కోసం అధికారుల బృందాన్ని గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రల్లో అధ్యయనం చేయడానికి పంపిస్తామని చెప్పారు.

ఓయూ తోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయించడం జరిగిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. మరోవైపు ఎంతో మంది రైతులు అనేక సమస్యలు ధరణి పోర్టల్ కారణంగా ఎదుర్కొన్నారని చెప్పారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. రైతును రాజు చేసేందుకు అనేక సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

కాగా ధరణి కొంతమందికి ఆభరణంగా.. మరి కొంతమందికి భారంగా మారందని తెలిపారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని భట్టీ విక్రమార్క వెల్లడించారు.

You may also like

Leave a Comment