Telugu News » Telangana : నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కాంగ్రెస్ ప్రణాళికలు వివరించిన మల్లు రవి..!

Telangana : నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కాంగ్రెస్ ప్రణాళికలు వివరించిన మల్లు రవి..!

కారిడార్ సెకండ్ పేజ్ లో మెట్రో మార్గం కూడా ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్ట్ తో దశాబ్దాలుగా ఉన్న వాహనదారుల కష్టాలు తీరుతాయన్నారు. కాగా కండ్లకోయ సమీపంలో మార్చి 9న సీఎం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు..

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) సర్కార్ కూలిపోతుందన్న బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) నేతల విమర్శలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 100 రోజులుగా కాంగ్రెస్ ప్రజా పాలన విజయవంతంగా సాగుతుందన్నారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. టీఆర్ఎస్ కు దగ్గరగా ఉంటుందని వాహనాల రిజిస్ట్రేషన్ లో టీజీ కి బాదులుగా టీఎస్ పెట్టిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ చేసిన తప్పును సరిదిద్డేందుకు టీఎస్ ను టీజీ గా మార్చినట్లు వెల్లడించారు.. కొత్త రిజిస్ట్రేషన్ లు నేటి నుంచి జరుగుతాయని తెలిపారు.. దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అదేవిధంగా రక్షణ శాఖ NH 44 పై రెండు ఎలివేటెడ్ కారిడార్లు కట్టడానికి అనుమతి ఇచ్చిందని మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. ఈ పనిని పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక పోయిందన్నారు.

ఇక ఎలివేటెడ్ కారిడార్లు వల్ల 5 జిల్లాలతో పాటు హైదరాబాద్ (Hyderabad) కు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. అదీగాక 1550 కోట్లతో 5.50 కిమీ మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుందని మల్లు రవి వెల్లడించారు.. కారిడార్ సెకండ్ పేజ్ లో మెట్రో మార్గం కూడా ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్ట్ తో దశాబ్దాలుగా ఉన్న వాహనదారుల కష్టాలు తీరుతాయన్నారు. కాగా కండ్లకోయ సమీపంలో మార్చి 9న సీఎం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు..

అయితే 2019 లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిఫెన్స్ కమిటీ మెంబర్ గా ఉండి ఈ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు.. ఇప్పుడు మరోసారి సీఎం హోదాలో రక్షణ శాఖ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లిన వెంటనే కంటోన్మెంట్ లో ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. అదేవిధంగా పారడైజ్ లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నామన్న మల్లు రవి.. 5.320 కిమీ మేర కారిడార్ నిర్మాణం ఉంటుందన్నారు.

ఇందులో 4.65 కిమీ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుందని.. అండర్ గ్రౌండ్ 0.6 కిమీ నిర్మాణము ఉంటుందని వివరించారు. ఇందు కోసం రక్షణ శాఖ 5 ఎకరాలు ఇచ్చిందని మల్లు రవి తెలిపారు.. వీటి నిర్మాణం వల్ల సికింద్రాబాద్, ఆదిలాబాద్ మధ్య ప్రయాణ సమయం..ఇంధనం ఆదా అవుతుందని, సరుకు రవాణా వేగంగా సాగుతుందని పేర్కొన్నారు.. అదేవిధంగా హైదరాబాద్, మెహదీపట్నం వద్ద స్కై వాక్ కు అనుమతి వచ్చిందని అన్నారు.

ఇందుకోసం రైతు బజార్ వద్ద ఉన్న 0.51 ఎకరాల భూమి రక్షణ శాఖ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. 15.15 కోట్ల మౌలిక వసతులు రక్షణ శాఖకు కల్పిస్తామని తెలిపారు.. ఇక గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించిన మల్లు రవి.. నాసిరకంగా కాళేశ్వరం కట్టి రాష్ట్రాన్ని ముంచిదని మండిపడ్డారు. డామ్ సేఫ్టీ అధికారుల నివేదిక తరువాత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

You may also like

Leave a Comment