Telugu News » Telangana : గొర్రెల పంపిణీలో గో‌‌ల్‌మాల్.. రూ.2.10 కోట్ల స్కామ్..!?

Telangana : గొర్రెల పంపిణీలో గో‌‌ల్‌మాల్.. రూ.2.10 కోట్ల స్కామ్..!?

ఆంధ్రప్రదేశ్‌‌ (Andhra Pradesh)కు చెందిన గొర్రెల అమ్మకందారులు గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ వద్ద గొర్రెలను కొనుగోలు చేసి, తెలంగాణకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు.

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కురుమ, యాదవుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.. అయితే బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆరోపణలు మాటల వరకే పరిమితం అయ్యాయని.. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో.. ఈ స్కామ్ బయటపడుతోందనే విమర్శలు మొదలైయ్యాయి..

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌‌ (Andhra Pradesh)కు చెందిన గొర్రెల అమ్మకందారులు గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ వద్ద గొర్రెలను కొనుగోలు చేసి, తెలంగాణకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. వీరి ఫిర్యాదు మేరకు ఇద్దరు కాంట్రాక్టర్లు, పశుసంవర్ధ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిపై సెక్షన్ 406, 409,420 కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు ఈ వ్యవహారంలో మొత్తం రూ.2.10 కోట్లు దారి మళ్లినట్లు ఇది వరకే అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్‌‌డీ కళ్యాణ్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో విచారించగా ఇప్పటికే డబ్బు చెల్లింపులు కూడా పూర్తయినట్లు అధికారులు రైతులకు తెలిపారు. ఈ నేపథ్యంలో గొర్రెల అమ్మకందారులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఓఎస్‌‌డీ కళ్యాణ్‌ ఛాంబర్‌ ఉంది. డిసెంబర్‌ 8న సాయంత్రం కిటికీ గ్రిల్స్‌ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడి నుంచి కీలక పత్రాలు, కంప్యూటర్లలోని హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్టు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ క్రమంలో కళ్యాణ్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. ఇంకా ఈ కేసు ఎటూ తెగలేదు.. ఇంతలో గొర్రెల పంపిణీ పై గో‌‌ల్‌మాల్ జరిగినట్టు వస్తున్న వార్తలు.. ఈ సంఘటనకు సింక్ అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

You may also like

Leave a Comment