Telugu News » Telangana : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పై ఆరోగ్యశాఖ మంత్రి కీలక సూచనలు..!!

Telangana : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పై ఆరోగ్యశాఖ మంత్రి కీలక సూచనలు..!!

రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారుని, ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించినట్టు మంత్రి తెలిపారు..

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనా (Corona) కేసులు రోజు రోజుకు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ కేసులు నమోదవుతోన్న వార్తలు ప్రజలను ఆందోళనకి గురిచేస్తున్నాయి. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ (Health Department) మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) కరోనా వస్తే తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు..

ఇందులో భాగంగా హైదరాబాద్, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య విధాన పరిషత్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు.. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆర్వీ కణ్ణన్, వైద్య విధాన పరిషత్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారుని, ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించినట్టు మంత్రి తెలిపారు.. హస్పటల్స్ లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నట్టు వెల్లడించారు.

కాగా ప్రస్తుతం పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ గుంపులోకి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.. ఒమిక్రాన్ వేరియంట్ కు సబ్ వేరియంట్ JN.1 అని తెలిపిన దామోదర రాజనర్సింహ.. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత ఉంటుందని వివరించారు..

You may also like

Leave a Comment