Telugu News » Telangana : తెలంగాణ క్రైమ్ రేటు వెల్లడించిన కమిషనర్.. నగరంలో 2 శాతం పెరిగిన నేరాలు..!!

Telangana : తెలంగాణ క్రైమ్ రేటు వెల్లడించిన కమిషనర్.. నగరంలో 2 శాతం పెరిగిన నేరాలు..!!

గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ క్రైమ్ రేట్ 2 శాతం పెరిగింది. 9 శాతం దోపిడీలు పెరిగాయి. మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అలాగే 12 శాతం చిన్నారులపై నేరాలు తగ్గాయని అన్నారు. వివిధ కేసులో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు, పొగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ చేయడం జరిగిందని సీపీ తెలిపారు.

by Venu

ఈ సంవత్సరానికి ముగింపు దగ్గర పడిన సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) సీపీ (CP) కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (Kottakota Srinivas Reddy) మీడియా సమావేశం నిర్వహించారు. ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూ (Crime Review)పై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలంగాణ (Telangana)లో ఈ సంవత్సరం 24, 821 FIR లు నమోదు అయ్యాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ క్రైమ్ రేట్ 2 శాతం పెరిగింది. 9 శాతం దోపిడీలు పెరిగాయి. మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అలాగే 12 శాతం చిన్నారులపై నేరాలు తగ్గాయని అన్నారు. వివిధ కేసులో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు, పొగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ చేయడం జరిగిందని సీపీ తెలిపారు. ఇక రాష్ట్రంలో జరిగిన హత్యల విషయానికి వస్తే.. ఈ ఏడాది 79 హత్యలు, 403 రేప్ కేసులు, 242 కిడ్నాప్‌లు, 4909 చీటింగ్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు..

మరోవైపు రోడ్డు ప్రమాద వివరాలు కూడా సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరంలో 2637 రోడ్డు ప్రమాదాలు, 262 హత్యాయత్నాలు, 91 చోరీల కేసులు నమోదు అయ్యాయని వివరించారు.. ఈమేరకు 63 శాతం నేరస్తులకు శిక్షలు విధించడం జరిగిందని.. కోర్టులు 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించాయని.. 4465 మంది నేరస్తులకు శిక్షలు పడ్డట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు..

మరోవైపు గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 శాతం అత్యాచారం కేసులు పెరిగినట్టు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మత్తు పదార్థాల విషయంలో 740 మంది అరెస్ట్ అవ్వగా.. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు పట్టుబడినట్టు సీపీ తెలియచేసారు. కాగా సైబర్‌ నేరాల విషయాని కొస్తే గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం పెరిగినట్టు సీపీ పేర్కొన్నారు.

2023 లో ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా రూ. 401 కోట్లు.. మల్టిలెవల్ మార్కెటింగ్‌లో రూ. 152 కోట్లు.. ఆర్థిక నేరాల్లో రూ.10 వేల కోట్లు కు పైగా మోసం జరిగినట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు 245 మంది ల్యాండ్ స్కామ్ కేసులో, సైబర్ క్రైమ్ కేసులో 650 మందిని అరెస్ట్ చేశామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వివరించారు..

You may also like

Leave a Comment