తెలంగాణ (Telanagana)లో బీఆర్ఎస్ (BRS) పార్టీకి జరిగిన నష్టం పై నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్టు.. అధికారం కోల్పోయాక గాని అహంకారం దిగలేదని వీరు తీరు చూస్తున్న వారు అనుకొంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
బంధు పథకాల ప్రభావం సైతం బీఆర్ఎస్పై పడిందని.. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆరోపణలున్న నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ (Congress) వైపు మొగ్గు చూపినట్టు కేటీఆర్ తెలిపారు.. హైదరాబాద్ (Hyderabad).. తెలంగాణ భవన్లో నిర్వహించిన, జహీరాబాద్ (Zaheerabad) పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పలు విషయాలపై మాట్లాడారు..
శాసనసభ ఎన్నికల్లో 119 సీట్లలో, 39 సీట్లు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.. ఇది తక్కువ సంఖ్య ఏం కాదని, మూడింట ఒక వంతు సీట్లు గెలిచినట్లేనని పేర్కొన్నారు. అనంతరం నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 2014లో పోటీ చేసినప్పుడు పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు దీవించారన్నారు. కానీ ప్రస్తుతం కొత్త ఒక వింతలా, పాత ఒక రోతలా ప్రజలు భావించారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని తెలిపిన కేటీఆర్.. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది. ఈ మూడు ముక్కలాటలో బీఆర్ఎస్కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.