రాజకీయంగా బీఆర్ఎస్ (BRS) తలరాతను మార్చేలా ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం జరిగిందనే సంచలన నిజాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవస్థను భ్రష్టు పట్టించేలా సాగిన ఈ కేసులో తవ్విన కొద్ది నమ్మలేని నిజాలు వెలుగులోకి రావడం.. నమ్మకంగా నమ్మించి నయవంచనకు పాల్పడ్డ పార్టీ దుర్భుద్ది ఆశ్చర్యానికి గురిచేసేలా ఉందనే చర్చలు మొదలైయ్యాయి..
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 మాజీ డీసీపీ రాధాకిషన్ రావు (Radhakishan Rao) రిమాండ్ రిపోర్టులో షాక్ అయ్యే నిజాలు వెల్లడించారు. భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు.. ఐఎస్ బీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాలతో సీజ్ చేశారని తెలిపారు. అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు, బంధువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేశామని రాధా కిషన్ ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50 కోట్లను సైతం సీజ్ చేసినట్లుగా వివరించారు..
దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను 2016లో ఏర్పాటు చేసుకున్నారని తెలిపిన ఆయన.. నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ భుజంగరావు, సైబరాబాద్ వేణుగోపాల్ రావు, హైదరాబాద్ సిట్ తిరుపతన్నను నియమించుకొన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 8సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించారని అధికారులు గుర్తించారు. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్, 2023 ఎన్నికల్లో BRS పార్టీకి డబ్బులు తరలించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది.
మరోవైపు బీఆర్ఎస్ గెలుపు కోసం స్పెషల్ పోలీస్ టీం కృషి చేసిందని సమాచారం. టాస్క్ ఫోర్స్ టీమ్ కు వాహనాలు సమకూర్చారు మాజీ ఐఏఎస్. తన కులానికి చెందిన వారితో స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు. మాజీ ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ లోని సిబ్బందిని బెదిరించి డబ్బులు సరఫరా చేయించినట్లు గుర్తించారు. అదీగాక ఒక ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి ద్వారా రాధాకిషన్ డబ్బు తరలించినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా ప్రణీత్ రావు (Praneeth Rao), భుజంగరావు, వేణుగోపాల్ రావు ఎప్పుడూ బీఆర్ఎస్ బలోపేతం గురించే చర్చించేవారని తెలుస్తోంది. ఎప్పటికీ కారు మాత్రమే అధికారంలో ఉండాలని అందుకు ఏ పనినైనా చేయడానికి సిద్దంగా ఉండాలని చర్చించుకొన్నట్లు తెలుస్తోంది. వీరంతా వాట్సాప్, స్నాప్ చాట్, సిగ్నల్ యాప్ ద్వారా తరచూ రహస్యంగా చర్చించేవారని సమాచారం. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా వచ్చాక పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువైందని తెలుస్తోంది.
ప్రభాకర్ రావు ఎస్ఐబీ చేయాల్సిన పని కాకుండా ఎంతసేపు బీఆర్ఎస్ కోసమే పని చేసేవారని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్యనాయకులు, వారి కుటుంబసభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యాపారవేత్తల కార్యకలాపాలపై ఎక్కువగా దృష్టిపెట్టినట్లు.. అలాగే బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది అనుమానిత నేతలపై కూడా నిఘా పెట్టినట్లు బయటపడింది.