Telugu News » Hyderabad : పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారని ఊహించలేదు. ఫైర్ అయిన భట్టి..!

Hyderabad : పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారని ఊహించలేదు. ఫైర్ అయిన భట్టి..!

పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ దిగజారి మాట్లాడారన్నారని ఆరోపించారు. అబద్దాలు అంటేనే కేసీఆర్.. అందుకే ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవాలు వెతికినా కనబడవని భట్టి విక్రమార్క విమర్శించారు..

by Venu
kcr

తెలంగాణ (Telangana) రాజకీయాలు పాకిస్తాన్.. ఇండియా యుద్ధంలా సాగుతున్నాయి.. ముఖ్యంగా అధికారం చేపట్టినాక కేసీఆర్ (KCR) ఎలాగైతే విలువలకు తిలోదకాలిచ్చి రాజకీయాలు చేశారో.. ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) సైతం అదే దారిలో వెళ్ళడం గులాబీ బాస్ కు పంటికింద రాయిలా మారిందని టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం.. బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేస్తున్న ఆరోపణలని తెలుస్తోంది.

Bhatti Vikramarka: 'Are you escaping in the name of Bandh?' Bhatti's sensational comments!అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులు సైలంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి.. తర్వాత తన వ్యూహాలకు పదును పెట్టడంతో.. బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగాయి.. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రెండు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించుకోవడం కనిపిస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేసీఆర్ చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.. కాంగ్రెస్ లో చేరికలతో నిద్రపట్టడం లేదని విమర్శించారు.

పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ దిగజారి మాట్లాడారన్నారని ఆరోపించారు. అబద్దాలు అంటేనే కేసీఆర్.. అందుకే ఆయన మాట్లాడే మాటల్లో
వాస్తవాలు వెతికినా కనబడవని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు.. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారని ఊహించలేదన్నారు.. పిట్ట కధలు చెబుతూ.. నటనలో ఆస్కార్ కొట్టాలా ఉన్నారని ఎద్దేవా చేశారు..

నీళ్లు, కాళేశ్వరం గురించి నిజాలు చెప్పలేదు.. అదీగాక మీటింగ్ లో మైక్‌ సమస్య వస్తే.. కరెంట్‌ కోతలు అంటూ అబద్ధం చెప్పి.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. గత ప్రభుత్వం సరిదిద్దుకోలేనంత తప్పిదాలు చేసి.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించిన భట్టి విక్రమార్క.. అస్థవ్యస్థమైన అర్థిక వ్యవస్థను మూడు నెలల నుంచి గాడిలో పెడుతున్నామని తెలిపారు.. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పుల్ని ఇప్పటికి తీర్చలేక పోతున్నామని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment