రేవంత్ (Revanth) సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram), జర్నలిస్టు అమీర్ అలీఖాన్ (Amir Ali Khan)ల పేర్లను కేబినెట్ మరోసారి తీర్మానించింది. హైకోర్టు (High Court) ఆదేశాలతో ఈ రెండు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ తమిళిసైకి పంపించనుంది. అయితే ఇంతకు ముందు కూడా వీరి పేర్లు ఖరారు చేశారు. గవర్నర్ సైతం ఆమోదించిన విషయం తెలిసిందే..

సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదీగాక గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం కోర్టు చేసింది.
ఈ నేపథ్యంలో కేబినెట్ మరోసారి పేర్లను సిఫారసు చేసింది. అయితే తమకు ఎమ్మెల్సీలు అయ్యే అర్హతలు ఉన్నాయని శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ అంటున్నారు. అయితే గవర్నర్ తిరస్కరించినప్పుడే .. తెలంగాణ కేబినెట్ మరోసారి వారి పేర్లనే సిఫారసు చేసి ఉంటే గవర్నర్ తప్పక ఆమోదించాల్సి ఉండేది. అదే సమయంలో ఎన్నికలు రావడంతో కేసీఆర్ ఆ పని చేయలేకపోయారు. చివరికి ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ అకౌంట్ లో పడుతున్నాయి.