Telugu News » Telangana : సిద్దమైన బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా.. కానీ విడుదల అప్పుడే..!

Telangana : సిద్దమైన బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా.. కానీ విడుదల అప్పుడే..!

అదే సమయంలో తెలంగాణలో పది కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ (Congress) పార్టీ ఊహించని స్థాయిలో బలపడుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలంతా గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారని తెలుస్తోంది.

by Venu
bjp-big-plans-for-parliament-elections

తెలంగాణ (Telangana)లో ప్రధాన పార్టీల రాజకీయ వ్యూహాలు పద్మవ్యూహాన్ని మరపిస్తున్నాయి. రాబోయే ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటాలని మూడు పార్టీల నేతలు ఇప్పటికే పావులు కదపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జాతీయ పార్టీకి అవసరమైన లోక్ సభ సీట్లను అందించి హైకమాండ్ వద్ద మరింత నమ్మకం పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

bjp-big-plans-for-parliament-elections

అదే సమయంలో తెలంగాణలో పది కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ (Congress) పార్టీ ఊహించని స్థాయిలో బలపడుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలంతా గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారని తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ (BRS)కు చావోరేవోలా మారిందని అంటున్నారు.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీకి పట్టిన గతి పడుతుందనే టాక్ వినిపిస్తోంది. టీ బీజేపీ సైతం దూకుడుగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిటీకి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహుల పేర్లతో జాబితాను పంపిన రాష్ట్ర నాయకత్వం.. 8 నుంచి 10 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల జాబితాను ఈ వారంలో ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అదీగాక సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో ఏడు స్థానాలను కూడా తొలి జాబితాలో విడుదల చేసే అవకాశముందని సమాచారం.. ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో కాషాయం ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ సారి ఆ తప్పిదం జరగకుండా ఎన్నికల షెడ్యూల్‌కు 20 రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2024 లోక్‌సభ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఉత్కంఠగా జరగబోతున్నాయని తెలుస్తోంది.

You may also like

Leave a Comment