బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మండిపడ్డారు.. ఆయన కరీంనగర్ లో మాట్లాడిన ప్రతీ మాట అబద్దమే అని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని విమర్శించారు. మాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఆయన పెద్దరికానికి పెద్ద మచ్చ అని తెలిపారు. పాస్ పోర్ట్ లు అమ్మి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా పనిచేసిన చరిత్ర మాకు లేదని దుయ్యబట్టారు..
ఎవరినో తొక్కడం కాదు…ఈ ఎన్నికల్లో జనం కేసీఆర్ ను బొంద పెడతారని ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అధికారం పోయిన ఫ్రస్టేషన్ లో చేస్తున్న వ్యాఖ్యలు సరైనవేనా అని గమనించే స్థితిని కోల్పోయారని ఇరిగేషన్ పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఇంట్లో పడుకొన్న ఘనుడు ఆయన అని ఎద్దేవా చేశారు. పిచ్చిలేచిన వారు సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుటారు. ప్రస్తుతం ఆయన కూడా అదే స్థితిలో ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇవ్వాళ బ్రోకర్, జోకర్ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్.. ఆనాడు సీఎంగా ఉండి మెడిగడ్డ పై ఎందుకు నోరు విప్పలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనలా వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారని ఆరోపించారు. సూర్యాపేటకు సాగునీళ్ళు కాదు ఇచ్చింది…తాగునీరు మాత్రమే నాగార్జున సాగర్ నుంచి వదిలారని పేర్కొన్నారు.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నిజాం నవాబులా మారిన పొగరుబోతు వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదని మండిపడ్డారు.
కేసీఆర్ కు ఉన్న కమిషన్ల కకుర్తి వల్లే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టు గా మారిందని ఆరోపయించిన ఉత్తమ్.. ఆయన పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న పార్టీ.. 39 కి రావడం జరిగిందని అన్నారు.. అదేవిధంగా ప్రస్తుత కరువు కేసీఆర్ తెచ్చింది మాత్రమేనని తెలిపిన ఆయన కాంగ్రెస్ వల్ల రాలేదని వివరించారు. రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలనే కుట్రతో జిత్తుల మారి నక్క వేషాలు వేస్తున్న కేసీఆర్ మాటలు ప్రజలు నమొద్దని సూచించిన మంత్రి.. రాష్ట్రంలో పవర్, డ్రింకింగ్ వాటర్ సమస్య రాదని తెలిపారు..
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉనికి ఉండదని ఆరోపించిన ఉత్తమ్.. ఎవరు రండా…? రాష్ట్రాన్ని లూటీ చేసిన ఆయనే రండ, బ్రోకర్, దొంగ అని తీవ్రంగా విమర్శించారు. కృష్ణ జలాల్లో ఏపీ సీఎం జగన్ కు అమ్ముడుపోయిన నువ్వా మా గురించి మాట్లాదేదని ప్రశ్నించారు. కృష్ణ జలాలు అక్రమంగా ఆంధ్రకు తరలిపోవడానికి కారణం నువ్వు కాదా అని అన్నారు.. ప్లాన్, ప్రణాళిక లేకుండా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని మంత్రి తెలిపారు.
అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక కమిషన్ల కోసం ప్రాణహితను మార్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్మని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను మార్చారని మండిపడ్డారు.. దేశంలో ఉన్న ప్రాజెక్ట్ లన్నింటికి ఆయనే నిపుణులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేసీఆర్ చేసిన నష్టాన్ని మేము పూడ్చడానికి ప్రయత్నం చేస్తున్నామన తెలిపారు.
ప్రతి ఏటా 17 లక్షల కోట్ల అప్పు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.. నేడు రాష్ట్రంలో పంట నష్టపోవడానికి, రైతులు ఇబ్బందులు పడటానికి కారణం అయిన వ్యక్తి.. ఏం తెలవనట్లు రైతుల దగ్గరికి పోయి దొంగ వేశాలు ఆడుతున్నాడాని ఉత్తమ్ మండిపడ్డారు.. నష్టపోయిన ప్రతి రైతుకూ మా సానుభూతి, సహాయ సహాకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఇక నాగర్జున సాగర్ లో ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి 135 టీఎంసీల నీళ్ళుంటే, గత సంవత్సరం 166 టీఎంసీ లు గా ఉనాయన్నారు. అలాగే ఎస్సారెస్పీలో 13 టీఎంసీలు ఉంటే.. గత ఏడాది 27.5 టీఎంసీల నీళ్ళు ఉన్నాయని వివరించారు.
మిడ్ మానేరులో 7 టీఎంసీలుంటే.. గత ఏడాది 20 టీఎంసీల నీళ్ళు ఉండేవని.. లోయార్ మానేరులో 7 టీఎంసీల వాటర్ ఉంటే.. గత సంవత్సరం 10 టిఎంసీలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ తెలివి తక్కువ వల్లే ప్రాజెక్ట్ లు విఫలం అయ్యాయని ఉత్తమ్ ఆరోపించారు. ఆ దొంగలంత కలిసి ఒక నాసి రకం బ్యారేజి నిర్మించారని విమర్శించారు. నిపుణుల ఆదేశాల ప్రకారం ప్రాజెక్ట్ పనులు చేపడుతామని తెలిపిన మంత్రి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే వందకు వంద శాతం నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు..