Telugu News » Telangana : బీఆర్ఎస్ కు ఏమైంది.. పార్టీ మారం అంటూనే హ్యాండ్ ఇస్తున్న నేతలు..!

Telangana : బీఆర్ఎస్ కు ఏమైంది.. పార్టీ మారం అంటూనే హ్యాండ్ ఇస్తున్న నేతలు..!

ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ (KCR) తాను అధికారంలోకి రావడానికి, వచ్చాక పదవి సుదీర్ఘంగా కాపాడుకోవడానికి ప్రయోగించిన అస్త్రాలు అన్ని తిరిగి ఆయనకు ఎక్కుపెట్టాయని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరు కారు స్టీరింగ్ వదులుతున్నారు..

by Venu
KTR that BJP and BRS will meet.. Dan Nagender's sensational comments!

అధికారం ఉంటేనే అంతా నా వారు.. లేకుంటే ఎవరికి ఎవరు అనే విధంగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయని తెలుస్తోంది. గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వైభవం రాజ భోగాలను తలపించేలా సాగింది. కానీ ఒక్క ఓటమి.. బీఆర్ఎస్ (BRS) పార్టీనా.. అదెలా ఉంటది అని ప్రశ్నించే స్థితికి చేరింది. అప్పటి వరకు మా ఉద్యమ పార్టీ.. మా ప్రాణం, బీఆర్ఎస్.. చచ్చే వరకు ఈ పార్టీలో కొనసాగుతాం అని చెప్పిన నేతలు ఊహించని షాక్ ఇస్తూ.. జంప్ అవుతున్నారు.

తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ తోట వాడిపోయి.. పార్టీ కుటుంబీకులు మాత్రమే మిగిలేలా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అసలు బీఆర్ఎస్ ఉనికి ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు.. పదులు సంఖ్యలో పార్టీని వీడటం అధిష్టానాన్ని డిఫెన్స్ లో పడేసిందని తెలుస్తోంది. పొద్దున పార్టీ మారం అని స్టేట్ మెంట్ ఇచ్చి, సాయంత్రం అయ్యే సరికి కాంగ్రెస్, బీజేపీ (BJP) గూటికి చేరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

అయిన ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ (KCR) తాను అధికారంలోకి రావడానికి, వచ్చాక పదవి సుదీర్ఘంగా కాపాడుకోవడానికి ప్రయోగించిన అస్త్రాలు అన్ని తిరిగి ఆయనకు ఎక్కుపెట్టాయని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరు కారు స్టీరింగ్ వదులుతున్నారు.. మరికొందరు సమయం కోసం మాటు వేశారని అనుకొంటున్నారు.. ఈ సమయంలో ఎవరిని నమ్మాలో తెలియక గులాబీ బాస్ రాజకీయ జ్ఞానం కొంత ఆందోళనలో పడినట్లు చర్చించు కొంటున్నారు..

ఒక వైపు కూతురు చేసిన ఘనకార్యం.. మరో వైపు ఉనికి కోల్పోతున్న పార్టీ.. ఆ పెద్దాయన చతురతను ప్రశ్నిస్తున్నాయని అనుకొంటున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా బీఆర్​ఎస్​ పార్టీకి గట్టి ఎదురదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన చేవెళ్ల (Chevella) ఎంపీ రంజిత్‌ రెడ్డి ( MP Ranjith Reddy) రాజీనామా చేసి కాంగ్రెస్ (Congress)లో చేరగా.. అన్నా నీవెంటే ఉంటా అని తెలిపిన దానం సడెన్ గా షాకిచ్చారు..

కాగా ఇటీవల సీఎంతో భేటీ అయిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender), పొద్దున పార్టీ మారనని క్లారిటీ ఇచ్చారు.. కానీ తాజాగా హస్తం కండువా కప్పుకొని ట్విస్ట్ ఇచ్చారు.. ఇక లోక్ సమరం ముగిశాక.. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చలు అప్పుడే మొదలైయ్యాయి..

You may also like

Leave a Comment