Telugu News » Telangana : గెలవడం ముఖ్యం కాదు-ఓటమే లక్ష్యం.. బీఆర్ఎస్ టార్గెట్ వారేనా..?

Telangana : గెలవడం ముఖ్యం కాదు-ఓటమే లక్ష్యం.. బీఆర్ఎస్ టార్గెట్ వారేనా..?

అదేవిధంగా కడియం పార్టీ మార్పు బీఆర్ఎస్ పెద్దల్ని ఎక్కున బాధపెట్టినట్లు చర్చించుకొంటున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు. పసునూరి దయాకర్‌, ఆరూరి రమేశ్‌, తాటికొండ రాజయ్య మొదలగు వీరంతా కడియం వల్లే పార్టీకి దూరమయ్యారని భావిస్తున్నారు..

by Venu
mla kadiyam srihari press meet at telangana bhavan brs lok sabha preparatory meetings at telangana bhavan

ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పరిస్థితి చిత్రంగా మారిందని అనుకొంటున్నారు.. ఇప్పటి వరకు పదవులు అనుభవించి.. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ వీడి వెళ్తున్న నేతలు పెరిగిపోవడంతో.. కారు నెక్స్ట్ ఇక స్క్రాప్ కు పోవడం ఖాయమా? అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు.. అయితే పడిపోతున్న పార్టీని నిలబెట్టడానికి స్వయంగా కేసీఆర్ (KCR) రంగంలోకి దిగినట్లు చర్చించుకొంటున్నారు..

ఈ సమయంలో ఉన్న నేతలనైనా కాపాడుకొని.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ మారిన నేతలను జంతువులతో పోల్చి కేసీఆర్ తీవ్ర దూషణలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము గెలవడం కంటే.. తమను వంచించి.. పార్టీకి ద్రోహం, మోసం చేసి పోయిన నేతల్ని ఓడించి తీరాలని కంకరణం కట్టుకొందనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చేవెళ్ల (Chevella) సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari), ఖైరతాబాద్‌ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్‌లను ఓడించి తీరుతామని ముఖ్య నేతలు శపథం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. తాము గెలవకపోయినా పర్వాలేదు వారు మాత్రం ఓడాలన్న స్ట్రాటజీని అమలు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా కడియం పార్టీ మార్పు బీఆర్ఎస్ పెద్దల్ని ఎక్కున బాధపెట్టినట్లు చర్చించుకొంటున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు. పసునూరి దయాకర్‌, ఆరూరి రమేశ్‌, తాటికొండ రాజయ్య మొదలగు వీరంతా కడియం వల్లే పార్టీకి దూరమయ్యారని భావిస్తున్నారు.. వీరందరిని కాదని.. కడియంకు.. ఆయన కుమార్తెకు ప్రాధాన్యం ఇస్తే కృతజ్ఞత లేకుండా మోసం చేశారన్న కోపం బీఆర్ఎస్ హైకమాండ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చిన నేతలపై అధిష్టానం రీవెంజ్ కు సిద్దం అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి..

You may also like

Leave a Comment