Telugu News » KCR : కేసీఆర్ పేరు మీద ఉన్న ఆస్తులు.. అప్పులు ఎన్నో తెలుసా.. పాపం ఎంత పేదవాడు అంటే..??

KCR : కేసీఆర్ పేరు మీద ఉన్న ఆస్తులు.. అప్పులు ఎన్నో తెలుసా.. పాపం ఎంత పేదవాడు అంటే..??

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. బీఆర్ఎస్ (BRS) పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్‌ (KCR)కు సొంతంగా కారు కూడా లేదని, వ్యవసాయమే వృత్తిగా ఉన్న తన పేరు మీద సెంటు సాగు భూమి కూడా లేదని బీదరైతు కేసీఆర్‌ వెల్లడించడం ఘొరం అంటున్నారు జనం.

by Venu

తెలంగాణ (Telangana)లో రాజకీయనేతలు చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తుంటే కామన్ మ్యాన్ (Common Man)కు తన బ్రెయిన్ (Brain) దొబ్బిందా అనే అనుమానం వస్తుంది. అర్జంటుగా వెళ్ళి మైండ్ కు కరెంట్ షాక్ పెట్టుకుంటే కానీ ఎన్నికలు అయ్యే వరకు బ్రతకను అని అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అంతలా గాబరా పడే మ్యాటర్ ఏంటని అనుమానం వస్తుంది కదా..

kcr

మన తెలంగాణ సీఎం చాలా గరీబ్ వ్యక్తి అని తెలిసినప్పటి నుంచి జనానికి జాలి కలుగుతుందని అనుకుంటున్నారు. అయ్యే పాపం అని నెల నెల పింఛన్ తీసుకునే అవ్వలు తాతలు కూడా బాధపడుతున్నారని చాకి రేవుకాడా ముచ్చట్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖాలు చేసిన కేసీఆర్‌.. తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు..

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. బీఆర్ఎస్ (BRS) పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్‌ (KCR)కు సొంతంగా కారు కూడా లేదని, వ్యవసాయమే వృత్తిగా ఉన్న తన పేరు మీద సెంటు సాగు భూమి కూడా లేదని బీదరైతు కేసీఆర్‌ వెల్లడించడం ఘొరం అంటున్నారు జనం.. తనకు ఉన్న భూములన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులని, నేనూ రైతునే.. పెద కాపునే.. వ్యవసాయమే చేస్తున్నా.. అని చెబితే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

మరోవైపు 2018 డిసెంబరు అంటే గత ఎన్నికల సమయానికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ మొత్తం కలిపి రూ. 5.63 కోట్లు ఉంటే ఇప్పుడు అది రూ. 11.16 కోట్లకు పెరిగిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. అప్పుడు తన భార్య శోభ చేతిలో సుమారు రూ.94 వేలు ఉంటే ఇప్పుడు అది సుమారుగా రూ. 6.29 కోట్లకు పెరిగిందని, బంగారు ఆభరణాలు మాత్రం 2.8 కిలోలు ఉన్నట్లు తాజాగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అంతే కాకుండా నాలుగు నెలల క్రితం మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో పది ఎకరాల సాగుభూమిని కొన్నట్టు.. దీని విలువ ప్రస్తుతం సుమారు రూ. 28.47 లక్షలుగా కేసీఆర్‌ పేర్కొన్నారు. కాగా రూ. 17.83 కోట్లు, 9.67 కోట్ల చొప్పున స్థిర, చరాస్తుల రూపంలో కేసీఆర్‌కు ఉన్నట్టు.. 7.78 కోట్ల చరాస్తులు మాత్రమే ఆయన భార్య పేరు మీద ఉన్నట్టు.. ఇక ఉమ్మడి ఆస్తిగా రూ. 9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ పేరు మీద రూ. 17.27 కోట్లు, కుటుంబం పేరు మీద రూ. 7.23 కోట్ల మేర అప్పులు ఉన్నట్టు కేసీఆర్‌ వెల్లడించారు..

తన బీద జీవితానికి సొంతంగా కారు, బైక్ లేకపోయినా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర 14 వాహనాలున్నాయని పేర్కొనడం చూసిన పేదవాడి ఫ్యూజులు కొట్టేసాయని అనుకుంటున్నారు. కాగా వీటి విలువ రూ. 1.16 కోట్లుగా తేలగా.. మొత్తంగా 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల మేర వ్యవసాయేతర భూములు కేసీఆర్ కుటుంబానికి ఉన్నట్టు తేలిందట.. కాగా ఈ బీద సీఎం కేసీఆర్ ఆస్తులను చూసి గడచిన ఐదేండ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్ అయిన విషయం మరచినట్టు ఉన్నాడని జనం చర్చించుకుంటున్నారు..

You may also like

Leave a Comment