తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మాటల మధ్య ఆసక్తికర సంభాషణలు కోటు చేసుకొంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రతిపక్ష నేతలకు సమాధానాలు ఇస్తూ.. వారి ప్రశ్నలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీకి అండగా నిలిచిందని ఆరోపించారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం రాజకీయాలు చేస్తున్నారని, చివరికి కేటీఆర్ (KTR)ను సీఎం చేసే ఆలోచనలో ఉన్న విషయాన్ని సైతం కేసీఆర్, మోదీ తో చర్చించినట్లు రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ (BJP) బంధం పెన్నా సిమెంట్ కంటే స్ట్రాంగ్ అని.. ఫెవికాల్ లా అంటుకొని ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ (KCR) కొన్ని చెబుతారని, కొన్ని దాస్తారని పేర్కొన్నారు.
రూ.100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న ప్రధాని మోదీ.. రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను, కవితను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని తెలిపిన రేవంత్.. అప్పుడే వీరి బంధం బాహ్యప్రపంచానికి తెలిసి పోయిందన్నారు.. గతంలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి ఓటేస్తే.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను కేసీఆర్ సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.
మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి బంధం లేదని రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఓడించిందని చెప్పారు. సీఎం