Telugu News » మళ్ళీ తమన్ దొరికిపోయాడుగా.. ఈసారి మహేష్ బాబు మోసపోయాడు…!

మళ్ళీ తమన్ దొరికిపోయాడుగా.. ఈసారి మహేష్ బాబు మోసపోయాడు…!

by Sravya

మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా రాబోతోంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. అయితే టాలీవుడ్లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువమంది లేరు కేవలం దేవి శ్రీ ప్రసాద్ తమన్ మాత్రమే అందరికీ దిక్కు అయ్యారు అప్పుడప్పుడు కీరవాణి కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటారు. అయితే తమన్ చాలాసార్లు దొరికిపోయాడు. తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకుంటాడు కానీ మరొక పక్కన ఉండి మాత్రం విమర్శలకి గురవుతాడు.

కానీ ఏది ఏమైనా మళ్లీ మాస్ హీరోలు అందరూ తమన్ వెనకాలే పడుతున్నారు. ఏదైనా సినిమా వస్తుందంటే చాలు ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతుంటాడు. క్రాక్ సినిమాలో భల్లేగా దొరికావే పాటకి యూట్యూబ్ నుండి ట్యూన్ ని తీసేసాడు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వచ్చిన ఓజీ తర్వాత ఐదు నిమిషాల్లోనే సినిమా బీజీఎమ్ కాపీ అని తెలిసిపోయింది. అది కూడా యూట్యూబ్ నుండే తీసుకున్నాడు. వీరసింహారెడ్డి మూవీలో జై బాలయ్య పాట ఒసేయ్ రాములమ్మ సినిమాలోని పాటలా ఉందని అడిగితే అవును నిజమే చాలా వాటికి ఆ పాట స్ఫూర్తి అని అన్నాడు.

Also read:

తమన్ గుంటూరు కారం సినిమా ఓ మై బేబీ ప్రోమో రిలీజ్ చేశారు. మూవీ లవర్స్ బుట్ట బొమ్మ పాటలా ఉందని అంటున్నారు. కొంతమంది ఇది చూసి తన బిట్స్ ని తానే దొంగలించుకున్నాడని అంటున్నారు. కొందరు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. పూర్తిగా వినకుండా ఒక అంచనాకి రావడం కరెక్ట్ కాదని అంటున్నారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

You may also like

Leave a Comment