మనుషులు డబ్బుకి, సుఖాలకి ఇస్తున్న ప్రయారిటీ.. కన్న వారికి కట్టున్న వానికి ఇవ్వడం లేదని నేటి కాలంలో జరుగుతున్న ఘోరాలను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇప్పటి రోజుల కంటే హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు బలంగా ఉండేవి. నీతి నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగిస్తూ, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా.. ఉన్నంతలోనే తృప్తిగా జీవితాన్ని గడిపేవారు.
కానీ నేడు ఇందుకు భిన్నంగా పరిస్థితులు సమాజంలో ఏర్పడ్డాయి. అందుకు ఉదాహరణ ఈ మధ్య జరుగుతున్న హత్యలు.. ఆత్మహత్యలు.. ఇక పెళ్లి అయ్యాక కూడా వివాహేతర సంబంధం నడుపుతున్న వారి జీవితాలు చివరికి ఏ గతికి చేరుకుంటున్నాయో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అయినా లోకంలో కామం చాటున ప్రాణాం పోతున్నా పట్టించుకోకుండా సుఖాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు.
ప్రస్తుతం చంపాపేట (Champapet) యువతి హత్య (murder)కూడా ఇదే కోణంలో జరిగింది. పెళ్లి అయ్యాక కూడా వివాహేతర సంబంధం (extramarital affair) కంటిన్యూ చేస్తున్న ఆ యువతిని ఆమె భర్తే చంపినట్టుగా తేలింది. ప్రియురాలి మరణం తట్టుకోలేని ప్రేమికుడు ఆ యువతి భర్తను భవనం పై నుంచి తోసివేసినట్టుగా పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన యువతి పేరు స్వప్న.. ఈమె పెళ్లికి ముందే సతీష్ అనే యువకున్ని ప్రేమించింది. వివాహం అయిన తర్వాత కూడా సతీష్‌తో సంబంధాలు కొనసాగిస్తోంది.
కొన్నాళ్ల క్రితం విషయం ప్రేమ్ కుమార్‌కు తెలిసి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్ బయటకు వెళ్లినపుడు సతీష్ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ప్రేమ్ కుమార్ వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక పట్టరాని కోపంతో స్వప్నను హత్య చేశాడు. ఆ తర్వాత సతీష్‌పై దాడికి ప్రయత్నించాడు.
అలా ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భవనంపై నుంచి ప్రేమ్ కుమార్‌ను, సతీష్ కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ కుమార్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పరారీలో ఉన్న సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చూసారా క్షణం సుఖం ముగ్గురి జీవితాలను ఆగం చేసింది. అయినా ఇలాంటి దారుణాలు సమాజంలో ఆగడం లేదు..