కాంగ్రెస్ (Congress) ప్రభత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.. హనుమకొండ (Hanumakonda) బీఆర్ఎస్ (BRS) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కవిత.. ప్రస్తుతం పింఛన్లు తీసుకొంటున్న 44 లక్షల మందికి.. పింఛన్ అమౌంట్ రూ.4వేలకు పెంచి.. కొత్త దరఖాస్తులు తీసుకొంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుపై అనేక సందేహాలు ఉన్నాయని అన్నారు.
రాష్ట్రంలో మగవాళ్ల పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్లకు.. 500 పథకం వర్తిస్తుందా? లేదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నట్టు కవిత తెలిపారు.. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి.. జనవరిలో కరెంటు బిల్లు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని గుర్తు చేశారు. ఇక కొత్త దరఖాస్తుల్లో అన్ని వివరాలు అడుగుతున్నారు. కానీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగట్లేదనే అయోమయం ప్రజల్లో నెలకొందని కవిత తెలిపారు..
ఇదే కాకుండా జనాల్లో ఇంకా చాలా అనుమానాలున్నాయని వెల్లడించిన కవిత.. బ్యాంక్ అకౌంట్ మళ్లీ అడుగుతారా? లేదా ఇలాగే కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా? అని ప్రజలు అనుకొంటున్నట్టు తెలిపారు.. నిరుద్యోగ భృతిపై ఫామ్లో అడగలేదనే సందేహం కూడా కొందరిలో ఉన్నట్టు పేర్కొన్నారు.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ మేలు జరుగుతుందని జనం అనుకొంటున్నట్టు కవిత తెలిపారు..
వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని కవిత సూచించారు. కొంత సంయమనం పాటించి, ఓపికతో ఉండి.. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు..