తెలుగులో చాలామంది దర్శకులు ఉన్నారు అయితే కొంతమంది దర్శకులు మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో అసలు తగ్గట్లేదు అటువంటి టాప్ డైరెక్టర్ల వివరాలు ఇప్పుడే చూద్దాం. సురేందర్ రెడ్డి అతనొక్కడే, కిక్, ధ్రువ, సైరా నర సింహ రెడ్డి వంటి సినిమాలు తీసాడు. సురేందర్ రెడ్డి ఒక సినిమాకి 5 నుండి 10 కోట్లు తీసుకుంటున్నాడు. అలానే, అర్జున్ రెడ్డి సినిమా తో ఫేమస్ అయినా సందీప్ ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా పారితోషకం మాత్రం 10 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అలానే, పరశు రామ్ బుజ్జి ఇప్పుడు ఒక్కో సినిమా కి 10 నుండి 15 కోట్లు వరకు తీసుకుంటున్నాడట.
బోయపాటి శ్రీను గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. ఊర మాస్ సినిమాని తీస్తూ ఉంటాడు. బోయపాటి ఎంత తీసుకుంటారనే విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను సినిమాకి 20 నుండి 25 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అదే అనీల్ రావిపూడి విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి సినిమాకి 20-25 కోట్లు దాకా తీసుకుంటున్నాడు.
Also read:
అలానే, వంశి పైడిపల్లి ఒక్క సినిమాకి 20 నుండి 25 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఒక్కో సినిమాకు 25 నుండి 30 కోట్లు తీసుకుంటున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 35 నుండి 40 కోట్లు తీసుకుంటున్నాడు. సుకుమార్ విషయానికి వస్తే.. పుష్ప సినిమా తో సుకుమార్ తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు ఏకంగా అంతర్జాతీయ స్థాయి లో ఫేమస్ అయ్యి పోయారు. 40-50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. రాజమౌళి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.