తిండి లేకున్నా ఒకరోజు ఉండవచ్చు కానీ వాటర్ లేకుండా ఒక్క గడియ కూడా ఉండలేం. అలాంటిది ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. అందులో ఎండాకాలం వచ్చిందంటే ఈ సమస్య తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నీటి కష్టాలు వర్ణించతరం కాదు.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మాత్రమే నీటి నిల్వ మిగిలి ఉంది.

తాజా నివేదిక ప్రకారం.. ఈ రిజర్వాయర్లలో ప్రస్తుత మొత్తం నీటి నిల్వ 8.865 BCM మాత్రమే ఉందని వెల్లడించింది. వాటి మొత్తం సామర్థ్యంలో 17 శాతం మాత్రమేనని చెప్పిన CWC.. గత సంవత్సరం ఇదే కాలంలో కంటే ప్రస్తుతం నిల్వ స్థాయి తక్కువకు పడిపోయిందని తెలిపింది. నీటి కొరత, నీటి పారుదల, తాగునీరు, జలవిద్యుత్‌కు ఈ సమస్య సవాళ్లగా మారినట్లు పేర్కొంది. అలాగే అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో నీటి నిల్వ స్థాయిలు ఘనంగా పెరిగినట్లు తెలిపింది.
అయితే, భారతదేశంలో మొత్తం 20.430 బీసీఎంల స్టోరేజీ కేపాసిటీ ఉన్న 23 మానిటరింగ్ రిజర్వాయర్లలో ప్రస్తుతం 7.889 బీసీఎంల నీరు ఉందని తెలిపిన సెంట్రల్ వాటర్ కమిషన్.. మొత్తం సామర్థ్యంలో ఇది 39 శాతమని తెలిపింది. అలాగే పశ్చిమ ప్రాంతంలో గుజరాత్, మహారాష్ట్రలో కూడా నీటి నిల్వ స్థాయిలు 11.771 BCMగా ఉందని వెల్లడించింది. ఇక ఉత్తర, మధ్య భారతదేశంలో కూడా నీటి నిల్వ స్థాయిలు క్రమంగా క్షీణిస్తున్నాయని పేర్కొంది.








