తెలంగాణ(Telangana)లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు(Road Accidents) సంభవించాయి. ఈ ఘటనల్లో 10మంది దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజి వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొంది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక పాప ఉన్నారు. పాప వున్నారు. వీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీ బ్రేక్ డౌన్ కావడం వల్లే హైవే పక్కన ఆపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా మరో ఘోర ప్రమాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బోనకల్లు మండలం ఎల్ గోవిందపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విజయవాడలోని గుణదల మేరీమాత వద్దకు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు గోవిందపురం గ్రామానికి చెందిన నల్లమల్ల చందర్రావు, మాణిక్యం, కొడుకు కృష్ణరాజు, ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను అంబులెన్స్ ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.