Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
ఒకవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా.. అభిమానులను మాత్రం నిరాశపరచకుండా చూసుకొంటున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. తాజాగా పవర్ స్టార్ ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh).. ఈ చిత్రం టైటిల్ వింటేనే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. అందుకే ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎందుకంటే గతంలో పవన్, హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే రిజల్ట్ రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని వెల్లడిస్తున్నారు. మేకర్స్ కూడా అదే రేంజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంకి సంబందించిన సాలిడ్ అప్డేట్ ను అందించారు..
తాజాగా భగత్’ స్ బ్లేజ్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ‘గాజు పగిలేకొద్దీ పదునెక్కుంది..’, ‘గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం’.. కనిపించని సైన్యం’ వంటి మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలుగిస్తాయని అంటున్నారు.. ఈ చిత్రంతో పవన్ మరోసారి తన స్టామినా ఏమిటో చూపిస్తారని ఫ్యాన్స్ కుషి అవుతున్నారు.. ఇక ‘భగత్’స్ బ్లేజ్ పేరుతో రిలీజ్ అయిన టీజర్లో పవర్‌స్టార్ తన విశ్వరూపాన్ని చూపించారని సంబరపడుతున్నారు..
ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపొద్ది అంటూ ఫస్ట్ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఆడియెన్స్ ను అలరించింది. మరోవైపు పొలిటికల్ టచ్ తో కూడిన ఈ పవర్ ఫుల్ వీడియోలో డైలాగ్స్ బాగున్నాయనే టాక్ అప్పుడే మొదలైంది. ఇదిలా ఉండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.