Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
నిత్యం మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలు అంటూ బిజీ బిజీగా ఉండే టీమ్ఇండియా (Indian cricketers) ప్లేయర్లు ఉజ్జయినీ (Ujjain) మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar) ప్రత్యేక పూజలు చేశారు. నందీ హాల్లో సాధారణ భక్తులతోపాటు కూర్చున్న క్రికెటర్లు.. అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారత జట్టు ఆదివారం రెండో టీ20 ఆడిన విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడగా.. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ క్రమంలో టీమ్ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించుకొంది.. ఈమేరకు జట్టులోని సభ్యులు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్.. ఉజ్జయినీలోని శ్రీ మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం వేకువజామున జరిగిన భస్మ హారతి (Bhasma Aarti) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా నిన్న అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్(34 బంతుల్లో 68 పరుగులు చేశారు. అందులో 5ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. శివమ్ దూబే (32 బంతుల్లో 63 నాటౌట్, 5ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో విజృంభించారు.
వరుసగా రెండో మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్‌శర్మ పరుగుల ఖాతా తెరువకుండానే సున్నాకు వెనుదిరిగాడు. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ(29) టచ్‌లోకి వచ్చాడు. కరీమ్ జనత్(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గులాబ్దిన్ నయీబ్(57) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. అఫ్గానిస్థాన్ ను బౌలింగ్‌తో కట్టడి చేసిన అక్షర్ పటేల్(2/17)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. కాగా మూడో మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరులో జరుగనుంది.