Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ( Congress) ప్రభుత్వమేనని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎగ్జిట్ పోల్స్ ( Exit Polls) కన్నా ముందే చెబుతున్నానని పేర్కొన్నారు. డిసెంబర్ 3 నుంచి రాష్ట్రంలో పండుగ ప్రారంభం కానుందన్నారు.
దారిన పోయే వాళ్లందరినీ అడగండన్నారు. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు ఒక్క సీటు ఎక్కువగానే రావాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని అన్నారు. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం కావాలని తన మనసులో మాట బయటపెట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రాణం పెట్టి కొట్లాడారన్నారు. డిసెంబర్ 7 సాయంత్రం ఎల్బీ స్టేడియంలో పడుకుంటానన్నారు. ఇప్పటికే దుప్పటి కూడా రెడీ చేసుకున్నట్లు తెలిపారు. మీడియా వచ్చి ఇంటర్వ్యూ చేయాలన్నారు.
డిసెంబర్ 9న తాను చప్పట్లు కొడుతూ ఉంటానన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడం ఖాయమన్నారు. తమ ఎమ్మెల్యేలు కాలు జారరని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు చేజారరన్నారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం రేవంత్ రెడ్డిని బండ్ల గణేష్ కలిశారు.