హైదరాబాద్ (Hyderabad), శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయం (Airport )లో ఆక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి తీసుకొస్తున్న బంగారం (Gold) కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది. అదీగాక నిందితులు బంగారాన్ని దాచిన తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని అధికారులు వెల్లడించారు.. ఇక కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆదివారం అర్ధరాత్రి వివిధ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయంకి వచ్చిన ప్రయాణికులను, కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు.. ఈ క్రమంలో అనుమానం వచ్చి, లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికులను స్కానింగ్ చేశారు. వీరిలో ముగ్గురు వ్యక్తుల వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికులు బంగారం ముక్కలను శరీర భాగంలో, పురుషనాలంలో, హార్డ్‌వేర్ టూల్స్‌తో పాటు లగేజీ బ్యాగులలో అక్రమంగా పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు.
వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి రూ.6.03 కోట్ల విలువ చేసే 13.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు విమానాశ్రయాలే అడ్డగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.. ఏ మాత్రం భయం లేకుండా యధేచ్చగా బంగారం స్మగ్లింగ్ (Smuggling)కు పాల్పడటం కనిపిస్తోంది.
అధికారులు కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నా దిరికే వారు దొరుకుతున్నారు.. ఇలా ఇప్పటికే భారీగా బంగారం పట్టుబడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక రకరకాల దారుల్లో ప్రయత్నాలు చేస్తున్న చివరికి అధికారులు వారి ఆటలు సాగనివ్వడం లేదు..