గత రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ (Delhi) మద్యం పాలసీ కేసు కవిత (Kavitha), అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో రాజకీయ ప్రకంపనాలు సృష్టించింది. ఇప్పుడే సంచలన నిజాలు బయటికి వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈడీ విచారణతో పోలిస్తే సీబీఐ మరికొంత అదనపు సాక్షాలను సేకరించిందని అనుకొంటున్నారు.. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్ట్ బీజేపీ మైలేజీ పెరిగేలా చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి..
మరోవైపు బీఆర్ఎస్ (BRS) పదేళ్లు తెలంగాణ (Telangana)లో అధికారంలో ఉన్నప్పుడు కంటి సైగతో రాజకీయాలను శాసించిన కవిత.. ఎన్నో కార్యాలు చక్కబెట్టినట్లు టాక్ ఉంది. అదీగాక కేసీఆర్ కు బ్యాక్ బోన్ లా కేటీఆర్, కవిత రాజకీయాలను నడిపించారు.. మొత్తానికి కోటలో రాణిలా వ్యవహరించిన జాగృతి అధ్యక్షురాలు.. ప్రస్తుతం అరెస్ట్ అయ్యి సరిగ్గా నెలరోజులు అయ్యింది. ఈ ఒక్క నెల ఆమె గతంలో చూడని ఎన్నో అనుభవాలు పరిచయం చేసింది..
అయితే కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఈ అంశం ఒక్క సారి కూడా బయటికి రాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కనీసం తన కూతురి అరెస్ట్ ఖండించక పోవడం, పరామర్శించక పోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కవితను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలుస్తున్నారు..
మరోవైపు కవితలో ఉన్న మునుపటి కాన్పిడెన్స్ కనిపించడం లేదనే చర్చ జరుగుతుంది.. మానసికంగా ఎంతో స్ట్రాంగ్ అయిన ఆమె అరెస్ట్ అయినప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ నెల రోజుల తర్వాత కోల్పోయినట్లుగా ఉందంటున్నారు.. అదేవిధంగా కుటుంబసభ్యులు తీహార్ జైలులో ఆమెను పలుమార్లు కలిసినప్పటికీ ఇంతవరకు కేసీఆర్ కలవకపోవడం రాజకీయ ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పికప్ అందుకోవాలని చూస్తున్న కేసీఆర్.. ప్రస్తుతం ఈ అంశంపై పెదవి విప్పితే ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయనే అంచనా వేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు.. కానీ ఏది ఏమైనా కన్న కూతురికంటే రాజకీయమే ఎక్కువనా అనే మాటలు సైతం వినిపిస్తున్నాయి..