పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) సీరియస్ గా తలపడుతున్న విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుత దేశంలో రీవెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి.. అధికారంలోకి వచ్చిన వారు చుక్కలు చూపించడం ఖాయం అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఉదాహరణలు కూడా ఉన్నాయంటున్నారు..
ఇలాంటి సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇటీవల పశ్చిమ బెంగాల్ (West Bengal)లో బీజేపీ నంబర్ 1కి వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా పుంజుకోవచ్చని పేర్కొన్నారు.. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్, పీకే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ మాట్లాడుతూ.. పీకే జోస్యం బీజేపీ స్పాన్సర్డ్ షోగా ఉందని సెటైర్ వేశారు..
ఆర్ఎస్ఎస్ (RSS) వ్యక్తి అయిన ప్రశాంత్ కిషోర్.. మారువేషంలో రాజకీయ విశ్లేషకుడిగా మారాడని ఆరోపించిన అజోయ్ కుమార్ (Ajoy Kumar).. అతని వ్యాఖ్యలను బీజేపీ ప్రాయోజిత కార్యక్రమమని పిలవాలని ఎద్దేవా చేశారు.. నితీష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ కూటమిలో ఉన్న పీకే.. బీహార్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు.. అయితే బీజేపీలో చేరాక ఆ విషయాన్ని పట్టించుకోలేదని వెల్లడించారు..
ఇదే సమయంలో అజోయ్ కుమార్ కాంగ్రెస్ పై బీజేపీ వంశపారంపర్య రాజకీయాలంటూ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్కు 27 ఏళ్లుగా ప్రధాని లేరనే విషయం గమనించాలని గుర్తు చేశారు.. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి.. కాంగ్రెస్ నేత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎవరు నిజాలు చెబితే వారిని ఆర్ఎస్ఎస్గా భావించడం కాంగ్రెస్ కు ఉన్న చెడు లక్షణంగా పేర్కొన్నారు..